సినిమా హీరో అవడానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలని అటువంటి ప్రత్యేకతలు ఏమి లేకుండా బక్క పలచని శరీరంతో ఉండే తనను తాను అద్దం ముందు నుంచుని చూసుకుంటూ ఉంటే అసలు తాను హీరోని ఎలా అయ్యాను? అనే విషయం తనకు ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగా ఉంటుందని అంటూ తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు ధనుష్.  రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ కుటుంబ సభ్యుడిగా అవ్వడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడం ఇప్పటికీ తనకి ఒక కలలా అనిపిస్తుందని ఈ క్రెడిట్ అంతా బహుశా దేవుడి దయ వల్ల అని అనుకోవాలి అంటూ తన పై తానే వ్యాఖ్యలు చేసుకున్న ధనుష్ ఈరోజు ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆ శక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. తన పిల్లలు రజినీకాంత్ నటించిన ‘లింగ’ సినిమా చూసి ‘నువ్వు తాతలా అలా అందమైన బట్టలు వేసుకుని అందంగా కనిపించాలని ఎందుకు ప్రయత్నించవు’ అని తన పిల్లలు అడిగినప్పుడు వాళ్ళు తనను పోగుడ్తున్నారో లేదంటే తన బక్కపల్చటి రూపం పై సెటైర్లు వేసారో అర్ధం కాలేదని నవ్వుతూ చెప్పాడు ధనుష్. ఇక కొత్త సంవత్సరం రోజున విడుదల కాబోతున్న తన సినిమా ‘రఘ వరన్ బి.టెక్’ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుందని చెపుతూ ‘నీకైదైనా లక్ష్యం ఉంటే అది త్రికరణ శుద్ధిగా చేయి’ అని తరుచూ తనతో చెప్పే రజినీకాంత్ మాటలకు ప్రభావితమై ఈ సినిమాను చేసాను అని అంటున్నాడు సూపర్ స్టార్ అల్లుడు..

మరింత సమాచారం తెలుసుకోండి: