ఈసంవత్సరం ‘రేసు గుర్రం’ తో సూపర్ హిట్ కొట్టి టాలీవుడ్ టాప్ హీరోల రేసులో రేసుగుర్రం లా దూసుకు పోతున్న అల్లుఅర్జున్ తన న్యూఇయర్ సెలిబ్రేషన్స్ ను చాల విభిన్నంగా జరుపుకోవాలని నిశ్చయించు కున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సామాన్యంగా మన హీరోలంతా తమ కుటుంబాలతో ఫ్యామిలీ ట్రిప్ లకు యూరప్ లేదంటే దుబాయ్ వెళుతూ ఉంటారు. ఇప్పటికే ప్రిన్స్ మహేష్ బాబు తన కుటుంబంతో అబుదాబి వెళుతున్నాడు.  అయితే అయాన్ పుట్టిన ఆనందంతో మంచి జోష్ మీద ఉన్న అల్లుఅర్జున్ తన న్యూఇయర్ సేలిబ్రేషన్స్ ను సరదాగా తన ఫ్యామిలీతో జరుపు కోవడంలో ఆశ్చర్యo లేదుకాని బన్నీ ఎంచుకున్న హాలిడేస్పాట్ అందరికీ షాక్ ఇస్తోంది. ఈసారి బన్నీ తన స్టార్స్ న్యూఇయర్ సేలేబ్రేషన్స్ సౌత్ ఆఫ్రికాలో ప్లాన్ చేసుకున్నాడని టాక్.  త్రివిక్రమ్ డైరెక్షన్లో బన్నీ చేస్తున్న న్యూమూవీ షూట్‌కి బ్రేక్ ఇచ్చి మరీ తన కుటుంబంతో వెళుతున్న తన హాలిడే స్పాట్ ప్రస్తుతం డేంజర్ జోన్‌గా ప్రపంచం భయపడుతున్న ఆఫ్రికాలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎబోలా వైరస్ స్ప్రెడ్ అయిన ఆఫ్రికా పేరు వింటేనే అందరు భయపడిపోతున్న నేపధ్యంలో బన్నీ తన న్యూఇయర్ సరదాల కోసం ఆఫ్రికా వైపు ఎందుకు వెళుతున్నాడు అంటూ చాలామంది ఆశ్చర్య పోతున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: