టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గ్లామర్ స్టార్ డంని సంపాదించుకున్న బ్యూటీ సమంత. ఇప్పుడు సమంత సాధారణ ఆర్టిస్ట్ కాదు. తన కంటూ ప్రత్యేక హోదా, ప్రత్యేక గుర్తింపుతో పాటు, అగ్రహీరోల సరసన కూర్చునే సత్తా కూడ తనకుంది. చిన్న హీరోలు సమంతతో కాంబినేషన్ చేయాలనుకోవడం చాలా కష్టతరమైన పని. ఇదిలా ఉంటే తాజాగా అల్లుఅర్జున్, సమంతపై సెటైర్స్ వేస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. సమంతపై వరుస కామెంట్స్ చేస్తూ , తనని తెగ ఆట పట్టిస్తున్నాడట. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ లో శరవేగంగా జరుగుతోంది. బన్ని, సమంతలపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తన్నారు. అందరితో సరదాగా ఉండే అల్లుఅర్జున్, సెట్స్ లో సమంతపై ఒకటే సెటైర్స్ వేస్తున్నాడు. షాట్ గ్యాప్ లో సమంతకి అల్లుఅర్జున్ చుక్కలు చూపిస్తున్నట్టుగా చిత్ర యూనిట్ నుండి అందుతున్న సమాచారం. అయితే సమంత మాత్రం, అల్లుఅర్జున్ వేస్తున్న సెటైర్స్ కి కొద్దిగా కోపంగా ఉన్నప్పటికీ, ఏ మాత్రం బయటకు వ్యక్తపరచకుండా, అందరితో నవ్వుతూ వెళుతుందట. ఈ మూవీలో అల్లుఅర్జున్ మొదటి సారిగా ముగ్గురు భామలతో ఆడిపాడుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: