ఈమధ్య కాలంలో మన టాలీవుడ్ యంగ్ హీరో హీరోయిన్స్ కు సామజిక చైతన్యం బాగా పెరిగి పోతోంది. ఒక వైపు నిర్మాతలకు చుక్కలు చూపెడుతూ కోట్లాది రూపాయలను పారితోషికాలుగా వసూలు చేస్తున్న క్రేజీ హీరో హీరోయిన్స్ మధ్య మధ్యలో సమాజ సేవలో కూడా పాల్గొంటూ తమను ఈ స్థాయికి తీసుకు వచ్చిన సామాన్యులకు మేమున్నాము అంటూ అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు.  ఇప్పుడు ఈ లిస్టులో హీరో రామ్ కూడా చేరిపోయాడు. తెలుస్తున్న వివరాల ప్రకారం శ్రవణ్ కార్తీక్ అనే 6 నెలల చిన్నారికి హార్ట్ డిసీస్ రావడంతో ఆ చిన్నారి ఒక ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే అత్యంత ఖర్చుతో కూడుకున్నఆపరేషన్ చేస్తే ఆ బాబు బతుకుతాడు అని డాక్టర్లు చెప్పారట.  ఈ విషయాలను తెలుసుకున్న ఆ చిన్నారి తల్లి తండ్రులు తమకు ఆర్ధిక సహాయం చేయవలసిందిగా సమంత నిర్వహించే ప్రత్యూష ఫౌండేషన్ ను కోరినట్లు తెలుస్తోంది.ఈ విషయం తెలుసుకున్న సమంత ఆ చిన్నారి బాబు విషయం రామ్ దృష్టికి తెచ్చిన వెంటనే ఒక్క నిముషం కూడా ఆలోచించకుండా ఆబాబు ఆపరేషన్ ఖర్చులను భరించడానికి ముందుకు వచ్చాడట. ఈ విషయాన్ని సమంత తన ట్విటర్ ద్వారా తెలియచేసి రామ్ కు తన కృతజ్ఞతలు తెలియచేసింది. రామ్ చేసిన మంచి పనితో ఆ పిల్లవాడికి మంచిగా ఆపరేషన్ సక్సస్ కావాలని కోరుకుందాం..

మరింత సమాచారం తెలుసుకోండి: