ఇప్పటికే కోట్లకు చేరుకున్న తన పారితోషికంతో నిర్మాతలకు చుక్కలు చూపెడుతున్న హన్సిక లేటెస్ట్ గా చూపెడుతున్న వింత ప్రవర్తన కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. షూటింగ్‌లకు డుమ్మా కొట్టకుండా క్రమం తప్పకుండా, నిర్ణీత సమయానికి హాజరవుతుందని అంతేకాకుండా దర్శకులు చెప్పిన విధంగా నటిస్తూ ఎక్స్ పోజింగ్ విషయంలో కూడా ఎటువంటి అభ్యంతరాలు హన్సిక వ్యక్తం చేయదు అని పేరు ఉండటంతో ఈ బ్యూటీ అడిగిన కోట్లు ఆమెకు ఇస్తూ సినిమాలను తీస్తున్నారు నిర్మాతలు. అయితే లేటెస్ట్ గా హన్సిక నిర్మాతలను తన ఇతర ఖర్చులతో హడలెత్తిస్తు కొత్త టార్చర్ కు తెర తీసిందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ బ్యూటీ చెన్నైకు వస్తే, తాను కోరుకున్న నక్షత్ర హోటల్‌లోనే బసచేస్తుందట అంతేకాదు నిత్యం ఆ హోటల్ నుంచే అన్ని రకాల వెరైటీ భోజనాలు తెప్పించుకుంటుందని ప్రచారం జరుగుతోంది.  సాధారణంగా హీరోయిన్లకు ఇద్దరు లేదా, ముగ్గురు సహాయకులు ఉంటారు కానీ హన్సిక ఏకంగా పది మంది సహాయకులతో షూటింగ్ స్పాట్ కు వస్తూ ఉండటంతో వారి ఖర్చుల భారం అంతా కూడా నిర్మాతల నెత్తి పై పడి కోలీవుడ్ నిర్మాతలు హన్సిక పేరు చెపితే హడలి పోతున్నారని టాక్. అదే విధంగా షూటింగ్ సమయాల్లో కనీసం రెండు సార్లు అయినా ఈ యాపిల్ బుగ్గల చిన్నారి ముంబాయికి వెళ్ళిపోతూ ఆ విమాన పయన ఖర్చులు కూడా నిర్మాతల పై భారం మోపుతోందని వార్తలు వస్తున్నాయి.  దీనితో అదిరి పోయిన కోలీవుడ్ నిర్మాతలు హన్సికకు బదులు మరో హీరోయిన్ ను వెతికే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: