ఇప్పటి వరకు మన క్రేజీ హీరోయిన్స్ తాము నటించే సినిమాలలో లిప్ లాక్ సీన్స్ లో నటించాలి అంటే ఆ సినిమా దర్శక నిర్మాతలకు తమ పారితోషికాన్ని మరింత పెంచమని డిమాండ్ చేసేవారు. అయితే కోలీవుడ్ యాపిల్ బుగ్గల చిన్నారి హన్సిక లిప్ లాక్ సీన్స్ విషయంలో ఇప్పుడు అనుసరిస్తున్న కొత్త పద్ధతి ఆమెతో సినిమాలు తీస్తున్న దర్శక నిర్మాతలకు టార్చర్ గా మారిందని వార్తలు వస్తున్నాయి.

హాట్ బ్యూటీస్ నయనతార, అనుష్క, కాజల్ లాంటి హీరోయిన్స్ చెప్పని విచిత్ర అభ్యంతరాలు లిప్ లాక్ విషయంలో చెపుతూ హన్సిక ఒక కొత్త వితండ వాదానికి తెర తీసింది. సినిమాలలో హీరోలతో చేసే లిప్ లాక్ సీన్స్ వల్ల అనారోగ్యకారకమైన బ్యాక్టీరియా ఒకరి నుండి మరొకరికి ట్రాన్ఫర్ అవుతాయని అందువల్ల తాను అటువంటి సీన్స్ లో నటించననీ హన్సిక మొండికేస్తోందని టాక్.

ఈమధ్య కాలంలో చాల ప్రముఖ అంతర్జాతీయ పత్రికల్లోనూ ముద్దు వల్ల బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందనే కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఆ బ్యాక్టీరియా వల్ల ఒక్కోసారి ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది అని కూడా పరిశోధనలో తేలిన విషయాన్ని ఆ వ్యాసాలలో రాసారు. ఈ వ్యాసాలన్నీ చదివిన హన్సికకు లిప్ లాక్ లపై తెగ భయం ఏర్పడింది అని టాక్.

దీనితో ఇటువంటి సీన్స్ నటించను అని చెపుతోంది హన్సిక. అయితే ప్రస్తుతం 7 సినిమాలలో నటిస్తూ మంచి బిజీగా ఉన్న హన్సిక దర్శకులు కోరినట్లుగా నటించకుండా ఇలా కోరి సమస్యలు తెచ్చుకుంటోంది ఏమిటి అని అంటూ ఆమె పై కోలీవుడ్ మీడియా కధనాలు రాస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: