‘ఆగడు’ పరాజయం తరువాత చరణ్ శ్రీను వైట్లల సినిమా ఉండదు అని అనుకున్నారు అంతా. అయితే అందరి ఊహాలను తలక్రిందులు చేస్తూ ఈసినిమా ఫిబ్రవరి నుండి పట్టాలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. అయితే అనేక కధలు అనుకున్న తరువాత చివరకు రామ్ చరణ్, శ్రీను వైట్లల కాంబినేషన్ లో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ప్రస్తుతం బయటకు రావడంతో ఆ స్టోరీ లైన్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

ఫిలింనగర్ లో వినపడుతున్న సమాచారం ప్రకారం ఈసినిమా శ్రీను వైట్ల స్టైల్ కు భిన్నంగా కామెడీ తో కూడిన సస్పెన్స్ ధ్రిల్లర్ అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కామెడీ టచ్ తో సినిమాలు తీయడంలో అందెవేసిన చేయిగా పేరుగాంచిన శ్రీనువైట్ల తనకేరియర్ లో మొట్టమొదటి సారిగా ధ్రిల్లర్ కామెడీ ప్రయోగం చరణ్ పై చేయడం చాల మందికి షాకింగ్ గా మారింది.

ఇప్పటి వరకు చరణ్ ఫైట్స్ డాన్స్ ల విషయంలో నేటి తరం యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నా కామెడీ పంచ్ లు విసరడంలో చరణ్ కు ఇంకా సరైన అనుభవం రాలేదని టాలీవుడ్ విమర్శకులు అంటూ ఉంటారు. అయితే ఈ విమర్శలకు సమాధానం చెప్పాలని చరణ్ ఈ ప్రయోగాన్ని ఎంచుకున్నాడా అని అంటున్నారు.

ఇప్పటి వరకు మెగా హీరోలు పవన్ బన్నీలతో నటించిన సమంత మొట్టమొదటి సారిగా ఈ సినిమాలో రామ్ చరణ్ తో నటించబోతూ ఉండటంతో వీరిద్దరి కాంబినేషన్ వెండి తెర పై ఎలా ఉంటుంది అన్న ఆ శక్తి కూడా చాలామందిలో ఉంది. ఈ కామెడీ ప్రయోగం రామ్ చరణ్ కు ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: