సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి పెద్ద భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన చిత్రం ఐ. ఐ మూవీకి అయిన ఖర్చు దాదాపు 130 కోట్ల రూపాయలకు పైగానే ఉంది. అయితే పైకి చూపిస్తున్న లెక్కలు మాత్రం కేవలం 80 కోట్ల రూపాయలలోనే మూవీని పూర్తి చేశామని, చిత్ర నిర్మాతల వద్ద నుండి వినిపిస్తున్న సమాచారం. దాంతో తక్కువ లెక్కలను చూపించడం ద్వారా, ఇప్పుడు ఐ మూవీ బాక్సాపీస్ వద్ద లాభాల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పటి వరకూ ఐ మూవీ దాదాపు 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ మార్క్ ని టచ్ చేసింది. అందరు ఎంతగానో ఎదురుచూసిన శంకర్ విజువల్ వండర్ ‘ఐ’ అధ్బుతమైన ఓపెనింగ్స్ సాధించడంతో, ఇది సాధ్యమైందని అంటున్నారు. భారీ అంచనాలతో విడుదల అయిన ఐ మూవీ మూడు బాషల్లో కలపి వంద కోట్లు వసూలు చేసింది. ఈ మూవీకి కధా బలం లేకపోయినప్పటికీ, విక్రం పోషించిన పాత్రలు ప్రేక్షకులని ధియేటర్ కు తీసుకొస్తున్నాయి. ఐ మూవీపై మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ, కలెక్షన్స్ మాత్రం తగ్గటం లేదు. ఇప్పుడు బాక్సాపీస్ విషయానికి వస్తే, నిర్మాతలు ఈ మూవీని ఫ్రాఫిట్ బిజినెస్ తో రిలీజ్ చేసినా, డిస్ట్రిబ్యూటర్స్ కి మాత్రం దాదాపు 20 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుందని ట్రేడ్ పండిట్స్ క్లియర్ గా చెబుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ, దాదాపు ప్లాప్ కిందే వర్ణించవచ్చని అంటున్నారు. ఎందుకంటే తను నుండి రావాలిసిన మూవీ కాదని, సాధారణ సినీ ప్రేక్షకులు సైతం పెదవి విరుస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: