175 కోట్ల భారీ పెట్టుపడితో భారీ జానపద సినిమాగా టాపిక్ ఆఫ్ ఇండియన్ సినిమాగా రూపొందుతున్న ‘బాహుబలి’ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు కేవలం ఆ సినిమా మేకింగ్ ట్రైలర్స్ మాత్రమే బయటకు తీసుకు వస్తూ కాలం గడుపుకుంటూ వచ్చాడు రాజమౌళి. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతూ ఉండటంతో ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ విడుదలచేసి ‘బాహుబలి’ క్రేజ్ మరింత పెరగడానికి రాజమౌళి మరో సరికొత్త వ్యూహం రచిoచినట్లుగా వార్తలు వస్తున్నాయి.

గ్రాఫిక్ వర్క్స్ ప్రాధాన్యత ఉన్న ఈ సినిమా ట్రైలర్ కూడా ఫస్ట్‌లుక్‌లోనే అదిరేలా 100 సెకండ్ల డ్యూరేషన్‌తో అందర్లో సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉంటుందని యూనిట్ టాక్. ఇప్పటికే ఈ ట్రైలర్ మేకింగ్ లో బిజీగా ఉన్న రాజమౌళి ఈ ట్రైలర్ ను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయబోతున్నాడని టాక్.

సాధారణంగా అఫీషియల్ ట్రైలర్స్ 40 నుంచి 60 సెకండ్ల లోపే ఉండే సాంప్రదాయం ఉన్నా ఆ పద్ధతిని బ్రేక్ చేస్తూ రాజమౌళి ‘బాహుబలి’ ట్రైలర్ ను 100 సెకండ్ల డ్యూరేషన్‌ లో తయారుచేస్తూ ఉండటం బట్టి మొట్టమొదటి అఫీషియల్ ట్రైలర్ నుండే రాజమౌళి తన బాహుబలి విశ్వరూపాన్ని చూపెట్టడానికి నిశ్చయించుకున్నట్లుగా అర్ధం అవుతోంది.

ఈ వార్తలు ఇలా ఉండగా తమిళంలో ‘మాహుబలి’ గా వస్తున్న ఈ సినిమా తమిళ వెర్షన్ రైట్స్ ను ప్రభాస్ భాగస్వామిగా ఉన్న యూవీ క్రియేషన్స్ తో పాటు జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ సంయుక్తంగా భారీ రేటుకు ఈ చిత్రం హక్కులను భారీ రేటుకు దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏప్రియల్ 17న విడుదల కాబోతున్న ఈసినిమా విడుదల తేది దగ్గర పడుతూ ఉండటంతో ఈ సినిమా పబ్లిసిటీకి సంబంధించిన వ్యూహాత్మక ఎత్తుగడలు ఈ ట్రైలర్ విడుదల నుండే ప్రారంభం అవుతాయి అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: