నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరావు చనిపోయి నేటితో సంవత్సరం గడిచి పోయినా ఆయన స్మృతులలో ఇంకా తెలుగు ప్రజలు ఆయనను గుర్తుకు చేసుకుంటూనే ఉన్నారు. ఆయన జ్ఞాపకాలలో ఇంకా టాలీవుడ్ కొనసాగుతూనే ఉంది. ఈరోజు అక్కినేని వర్ధంతి సందర్భంగా ఆయన మనవలు అక్కినేని గురించి చెప్పిన విషయాలు అత్యంత ఆ శక్తి దాయకంగా ఉన్నాయి. తన తాత మిగిల్చిన జ్ఞాపకాల గురించి నాగచైతన్య తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ముంబాయిలో తాను యాక్టింగ్ స్కూల్ లో చేరినప్పుడు తాను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానని తెలుసుకుని ఆ యాక్టింగ్ ప్రిన్స్ పాల్ తనను ‘దేవదాసు’ సినిమా చూసావా? అని ప్రశ్నించడమే కాకుండా ముందు ఆ సినిమా చూసి నీ అభిప్రాయం చెప్పాక నీకు క్లాసులు మొదలుపెడత అని అనడంతో తన తాత గొప్పతనం ఏమిటో ఆరోజు తనకు అర్ధం అయిందని అని తాత అక్కినేని పై తన ప్రేమను షేర్ చేసుకున్నాడు

త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న అఖిల్ తన తాత అక్కినేనితో తన అనుభవాలను వివరిస్తూ తరుచు తనను పక్కన కూర్చో పెట్టుకుని తనకు ఊహరాని వయసులో నటించిన ‘సిసింద్రి’ సినిమాను చూస్తూ తెగ ఎంజాయ్ చేసేవారని, తన మొదటి సినిమా విడుదల అయ్యేలోపే తన తాత అక్కినేని దూరం కావడం తనను ఎంతో బాధించిందని అంటూ తన తాత చిరునవ్వును జీవితాంతం గుర్తుండి పోతుందని చెప్పాడు అఖిల్.

అక్కినేని మరో మనవడు సుశాంత్ తన తాత గురించి గుర్తుకు చేసుకుంటూ తనకు చిన్నతనంలో సరైన మార్కులు రానప్పుడు తనను పిలిచి ముద్దుగా భోజనం పెట్టి తనకు చదువుకునే అవకాశం చిన్నతనంలో ఎప్పుడూ రాలేదని అన్ని అవకాశాలు ఉండి కూడా ఎందుకు చదువుకోవు అని తన తాత అక్కినేని మెత్తగా మందలిoచిన నాటి నుండి తాను చదువు పై శ్రద్ధ పెట్టాను అని సుశాంత్ తన తాతను గుర్తుకు చేసుకున్నాడు.

ఇక అక్కినేని ముద్దుల మనవడు సుమంత్ తన తాతను గుర్తుకు చేసుకుంటూ తనతాత ప్రభావం తనపై చాల ఉందని చెపుతూ జీవితంలో వచ్చే పరాజయాలను ఎలా ఎదుర్కోవాలో తనకు తన తాత అక్కినేని ఎప్పుడూ విడమర్చి చెపుతూ ఉండేవారని అంటూ తన తాత చివరి రోజులలో నటించిన ‘మనం’ సినిమాను తాను ఇప్పటికీ పూర్తిగా చూడలేదు అని అంటూ ఆ సినిమాను చూస్తున్నప్పుడు తనకు ఏడుపు ఆగదని అందుకే తాను ఇప్పటికీ ‘మనం’ సినిమాను పూర్తిగా చూడానని తన బాధను షేర్ చేసుకున్నాడు. ఈరోజు తన తాత వర్ధంతి రోజున అక్కినేని కుటుంబం అంతా తన ఇంటికి వస్తున్నారని చెపుతూ తన తాతకు ఇష్టమైన వంటకాలు అన్నీ వండిస్తున్నాను అని అంటున్నాడు సుమంత్. అక్కినేని మనవలకే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారి గుండెలలో చిరస్మరణీయమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న నిజమైన నట సామ్రాట్ అక్కినేని..

మరింత సమాచారం తెలుసుకోండి: