టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ క్రేజీ ప్రాజెక్ట్ గా ప్రమోషన్ క్యాంపెయిన్ జరుగుతున్న బాహుబలి చిత్రంపై ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆసక్తి చూపుతుంది. తెలుగు భాషలో వస్తున్న చిత్రం అనే బ్రాండ్ నుండి బాహుబలి బయట పడింది. అందుకే బాహుబలి చిత్రంపై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు, ఈ మూవీపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే రీసెంట్ గా వచ్చిన రెండు భారీ చిత్రాలు బాక్రాపీస్ వద్ద బోల్తా పడటంతో, తరవాత రాబోతున్న బాహుబలి మూవీపై రిజల్ట్ ఎలా ఉంటుంది? అనేది కూడ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. లింగ, శంకర్ ఐ మూవీలు భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చి బాక్సాపీస్ వద్ద అనుకున్నంత రిజల్ట్ ను సాధించలేకపోయింది. మొత్తానికి భారీ చిత్రం అనే మార్క్ ని వేసుకున్న బాహుబలికి, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం పోటీపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. తాజాగా తమిళ పంపిణీదారుల హక్కులను స్టూడియో గ్రీన్ బ్యానర్ సహకారంతో యు.వి క్రియేషన్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ సంస్థ మిర్చి, రన్ రాజా రన్ సినిమాలను నిర్మించిన సంగతి తెలిసినదే. వీరు గత కొంత కాలంగా బాహుబలి చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకోవటానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే స్డూడియో గ్రీన్ బ్యానర్ సహకారంతో ఫైనల్ గా కోలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నారు. కోలీవుడ్ లో బాహుబలి మూవీని మహాబలి పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: