నందమూరి హీరోల మూవీలో కళ్యాణ్ రామ్ మూవీలు చాలా డిఫ్రెంట్. తెలుగు సబ్జెక్ట్స్ ఉన్న చిత్రాలే కాకుండా, టెక్నికల్ గా కొత్త తరహా మూవీలను తీయటానకి కూడ కళ్యాణ్ రామ్ ఆసక్తి చూపిస్తాడు. అలాగే తన మూవీలలో టెక్నికల్ వాల్యూస్ కూడ ఉండే విధంగా ప్రయత్నిస్తాడు. ఇదిలా ఉంటే తను తాజాగా నటించిన చిత్రం పటాస్. ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ జనవరి 23న జరుగుతుంది. దీంతో ఈ మూవీపై కళ్యాణ్ రామ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఓ రకంగా చెప్పాలంటే ‘పటాస్’ సినిమాతో బారి హిట్ పై కన్నేశాడు ఈ నందమూరి హీరో. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పోలీస్ పాత్రలో నటించారు. డిసెంబర్ నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ సోదరుడు నందమూరి జానకి రామ్ ఆకస్మిక మృతితో జనవరికి వాయిదా పడింది. యాంగ్రీ యంగ్ మాన్ లుక్ లో కళ్యాణ్ రామ్ ను చూపిస్తూ విడుదల చేసిన ఈ సినిమా యాక్షన్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇప్పటి వరకూ కళ్యాణ్ రామ్ మూవీలు అంటే సాధరణంగా ఓ లిమిట్ వరకూ మూవీ బిజినెస్ జరుగుతుంది. కానీ పటాస్ మూవీకి మాత్రం ఆ లిమిటేషన్స్ దాటిపోయి బిజినెస్ జరిగింది. దీంతో మూవీ కచ్ఛితంగా భారీ హిట్ ని అందుకుంటుందనే భావనలో ఉన్నాడు హీరో కళ్యాణ్ రామ్. డిస్ట్రిబ్యూషన్ కి చెందిన బిజినెస్ కూడ, గతంలో తను నటించిన చిత్రాలు కంటే, ఈ సారి కొద్దిగా పోటీ వాతావరణం నెలకొంది. కొన్ని ఏరియాల్లో అయితే పటాస్ మూవీ డిస్ట్రిబ్యూషన్ కోసం పైరవీలు కూడ జరిగాయి. ఇన్ని విషయాలను ద్రుష్టిలో పెట్టుకున్న కళ్యాణ్ రామ్, పటాస్ మూవీ హిట్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మొత్తానికి మూవీ రిలీజ్ తరువాత కాని అస్సలు విషయం తెలియదని ఫిల్మ్ ఇండస్ట్రీ అంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: