టాప్ యంగ్ హీరో జూనియర్ తో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు కలలు కంటూనే ఉంటాడు. జూనియర్ లాంటి మాస్ హీరోతో సినిమాను చేస్తే టాలీవుడ్ టాప్ దర్శకుల లిస్టులో చేరిపోవడం అతి సులువైన పని. అయితే జూనియర్ తో సినిమాను చేయడానికి అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వదులుకుని కళ్యాణ్ రామ్ తో సినిమా చేసిన దర్శకుడు అనీల్ రావిపూడికి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

ఇంజనీరింగ్ చదువుకుని సినిమాల పై ఉండే విపరీతమైన మోజుతో దర్శకుడిగా మారిన అనీల్ రావిపూడి మంచి రచయిత కూడా. అతడు తయారు చేసిన కథ విన్న కళ్యాణ్ రామ్ ఆ కథ బాగా నచ్చడంతో ఆ కథకు జూనియర్ ను హీరోగా పెట్టి తానే నిర్మిస్తాను అని కళ్యాణ్ రామ్ అన్నాడట. అయితే ఈ ‘పటాస్’ కథను తాను కళ్యాణ్ రామ్ ను దృష్టిలో పెట్టుకుని రాసానని తనకు ఈ కథలో జూనియర్ నటించడం కంటే కళ్యాణ్ రామ్ నటిస్తేనే ఈ కథకు న్యాయం జరుగుతుందని కళ్యాణ్ రామ్ ను ఒప్పించాడట దర్శకుడు అనీల్ రావిపూడి.

ఈకథ బాగా నచ్చడంతో కళ్యాణ్ రామ్ తానే నిర్మాతగా మారి మరియు హీరోగా నటించాడు. ఒక లంచగొండి పోలీస్ ఆఫీసర్ కొన్ని కారణాల వల్ల నిజాయితీగా మారితే వచ్చేసమస్యలను చూపెడుతూ నేటి సమాజంలో పెరిగి పోయిన లంచగొండి తనం పై సెటైర్ గా పూర్తి మసాల సినిమాగా ఈ ‘పటాస్’ ను మార్చినట్లు టాక్.

వరస పెట్టి వచ్చిన పరాజయాల నేపధ్యంలో కళ్యాణ్ రామ్ ఎన్నో ఆసలు పెట్టుకున్న ఈ ‘పటాస్’ ఎంత గట్టిగా పెలుతుందో రేపు తేలిపోతుంది. జూనియర్ ను కాదనుకుని కళ్యాణ్ రామ్ ను నమ్ముకున్న అనీల్ రావిపూడి నమ్మకం ఎంత వరకు సక్సస్ ను ఇస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: