మెగా కుటుంబ హీరోలను ఒక కథ చెప్పి ఒప్పించడం అంత సర్వ సాధారణమైన విషయం కాదని ఆ మెగా కాంపౌండ్ లోకి వెళ్ళి వచ్చిన చాలామంది రచయితలు దర్శకులు చెపుతూ ఉంటారు. ఎన్నో ఒడబోతల తరువాత కాని మెగా హీరోల సినిమాలకు సంబంధించిన కథలు ఎంపిక కావు. అందువల్లనే ఈ కుటుంబ హీరోల సినిమాల సక్సస్ రేట్ చాల ఎక్కువగా ఉంటుంది అనే వార్తలు కూడా ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా మెగా హీరోలు నటించే సినిమా కథల ఎంపిక వెనుక ఒక మహిళ నిర్ణయాత్మక శక్తిగా ఉంటుంది అంటూ కొన్ని కథనాలు ఈ మధ్య ఫిలింనగర్ లో తెగ వినపడుతున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా చిరంజీవి భార్య సురేఖ సోదరి అయిన వసంత ఈ నిర్ణయాత్మక శక్తి అని టాక్. ఈమెకు సినిమాల పట్ల ఉండే విపరీతమైన అవగాహన వల్ల ఈమెకు నచ్చిన కథ మెగా హీరోలకు సూపర్ హిట్ అవుతుంది అనే సెంటిమెంట్ ఉందట.

అల్లుఅర్జున్ తో ‘రేసు గుర్రం’ సినిమాను తీసిన సురేంద్ర రెడ్డి ఈ కథను 10 సార్లకు పైగా వసంతకు వినిపించిన తరువాత మాత్రమే బన్నీ ఈ సినిమాలో నటించడానికి ఓకె చేసాడు అనే టాక్ కూడా ఉంది. ఈమె ఒక దర్శకుడు చెప్పిన కథకు ఓకె అన్న తరువాత మాత్రమే చిరంజీవి, అరవింద్ లు తమ మెగా కుటుంబ హీరోలు నటించబోయే సినిమాల విషయంలో చివరి రాజముద్ర వేస్తారు అని అంటారు.

సాధారణంగా ఒక హీరోకు ఒక కథ చెప్పే విషయంలో ఆ హీరోగాని లేదంటే ఆ హీరోకి సన్నిహితంగా ఉండే వ్యక్తులు కాని కథను ఓకె చేసే విషయంలో ప్రభావం చూపెడుతూ ఉంటారు. అయితే మెగా కుటుంబంలో మటుకు వైకుంఠపాళి ఆటలా రచయితకు తాను చెప్పే కథ చివరి వరకు టెన్షన్ పెడుతూనే ఉంటుందని మెగా కుటుంబానికి కథలు చెప్పే విషయంలో రచయితలు భయపడుతున్నారు అని టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: