సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన్ స్టార్ డం ని క్రియేట్ చేసుకున్న బ్యూటీ నయనతార. గత కొంత కాలంగా నయనతార ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస మూవీలకు దూరంగా ఉంటుంది. కేవలం సెలెక్టెడ్ మూవీలనే చేసుకుంటుంది. ముఖ్యంగా తను కోలీవుడ్, టాలీవుడ్ మూవీలకే ప్రాధాన్యం చూపుతుంది. కోలీవుడ్ లో ప్రస్తుతం రెండు మూవీలకి పని చేస్తున్న నయనతారకి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరోలు ఝలక్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళితే, నయనతారకి ప్రస్తుతం యంగ్ హీరోలతో జోడి కట్టాలని ఉందట. గతంలో యంగ్ హీరోలు నయనతారాని వారి మూవీల్లోకి తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు, తను మాత్రం ఇష్టంగా లేనని వారకి ఘూటుగా చెప్పుకొచ్చింది. కుర్రహీరోలతో నటిస్తే, తన ఫేం పోతుందని ఆ సమయంలో నయనతారా అభిప్రాయపడిందట. సీన్ కట్ చేస్తే ఇప్పుడు నయనతారకి ఆఫర్స్ తక్కువుగా ఉండటంతో, ఫాంలో ఉన్న కుర్రహీరోల సరసన నటించటానికి తను గ్రీన్ సిగ్నల్స్ ఇస్తుంది. కాని ఈ యంగ్ హీరోలు తనని తీసుకోవటానికి ఆసక్తి చూపటం లేదు. ముఖ్యంగా నయనతారని తీసుకుంటే హీరో హీరోయిన్స్ మధ్య ఏజ్ బార్ అనేది క్లియర్ గా తెలిసిపోతుందని వారు క్లారిటీగా చెబుతున్నారు. రీసెంట్ గా కోలీవుడ్, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీల నుండి వరుసగా ఇటువంటి రియాక్షన్స్ రావడంతో నయనతార తెగ బాధపడిపోతున్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: