టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలెక్టెడ్ మూవీలను చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టార్ డం ని క్రియేట్ చేసుకున్న హీరో దగ్గుబాటి రానా. రానా ముఖ్యంగా తెలుగువాడైనప్పటికీ, తన కటౌట్ కి తగ్గ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటించటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రానా సెటిల్ అవ్వటానికి తెగ క్రుషి చేస్తున్నాడు. అందుకే ”దమ్ మారో దమ్”,”ఏ జవాని ఏ దివానీ”, ‘డిపార్ట్మెంట్’ సినిమాలలో కీలకపాత్రలలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన ”బేబీ”లో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు. ఇందులో రానా పాత్ర చాలా బాగుందంటూ బిటౌన్ లో న్యూస్ వినిపిస్తుంది. పలువురు ప్రముఖులకు, మీడియాకు వేసిన ప్రత్యేక షోకి రానా పై మంచి టాక్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమాలో తాప్సీ, అనుపమ్ ఖేర్ మరియు డ్యాన్నీలు నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్ నేపధ్యంలో సాగనున్న ఈ సినిమాను గతంలో ‘వెడ్నస్ డే’, ‘స్పెషల్ 26′ వంటి సినిమాలను తెరకెక్కించిన నీరజ్ పాండే దర్శకత్వం వహించాడు. ఈరోజు థియోటర్స్ లో రిలీజ్ అన్ని చోట్ల సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమౌతుంది. ఇదిలా ఉంటే రానాకి బిటౌన్ మరో భారీ ఆఫర్ వచ్చింది. షారుఖ్ ఖాన్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీలో లీడ్ రోల్ ఉన్న పాత్రకి రానా సెలక్ట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన న్యూస్ పై అఫిషియల్ స్టేట్ మెంట్ త్వరలోనే బయటకు రానుందని అంటున్నారు. ఈ ఆఫర్ మిస్ కాకుండా ఉంటే, రానా కెరీర్ బాలీవుడ్ లో దూసుకుపోవడం ఖాయం అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: