రాంచరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గోవిందుడు అందరివాడేలే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు ప్రభుదేవా సిద్దం అవుతున్నారనే విషయం తెలిసిందే. గతంలో గోవిందుడు అందరివాడేలే మూవీని ప్రభుదేవా కోసం ప్రత్యేకంగా ప్రదర్శించడంతో అది చూసినప్పటినుంచి దాన్ని ఎలాగైనా హిందీలో తీయాల్సిందేనని ప్రభుదేవా అంటున్నాడు. ఈ విషయాన్ని సీరియస్ తీసుకున్న ప్రభుదేవా, ఓ నిర్మాతతో హిందీ రిమేక్ రైట్స్ ని కొనిపించటానికి విశ్వప్రతయ్నాలు చేశాడు. కాని చివరి నిముషంలో ఆ విషయం కొంత కాలం పెండింగ్ లో పడింది. ప్రభుదేవా తీసిన యాక్షన్ జాక్సన్ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టడంతో, ఇక తను రిమేక్ మూవీల జోలికి వెళితేనే మంచనదని అంటుకుంటున్నాడట. తాజాగా షారుఖ్ ఖాన్, ప్రభుదేవాకి ఝలక్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే, గోవిందుడు అందరివాడేలే మూవీని హింధీలో రిమేక్ చేయిస్తే, అందులో హీరోగా షారుఖ్ ఉంటే మంచిదని ప్రభుదేవా అభిప్రాయ పడ్డాడు. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ డేట్స్ తీసుకొని, తన ప్రపోజల్ ని షారుఖ్ కి వినిపించాడు ప్రభుదేవా. కాని షారుఖ్ మాత్రం “గోవిందుడు అందరివాడేలే మూవీ తెలుగులోనూ సరిగా సక్సెస్ సాధించలేదు. దాన్ని హిందీలో ప్రేక్షకులు ఎంత మాత్రం ఆధరించరు. అయినా ప్రస్తుతం రిమేక్ లు చేసే ఆలోచన నాకు లేదు. ఉన్నప్పుడు పిలుస్తాను” అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడంట. షారుఖ్ ఖాన్ నుండి అటువంటి సమాధానాన్ని ప్రభుదేవా ఎక్స్ పెక్ట్ చేయలేదంట. ఈ విషయం బిటౌన్ లో అందరికి తెలియడంతో, ప్రభుదేవా కొద్దిగా ఫీల్ అయినట్టు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: