దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కు పద్మ విభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే నాడు ప్రకటించే పద్మ అవార్డుల పురస్కారంలో ప్రముఖ సినిమా నటులు కళాకారులు ఉండటం సర్వ సాధారణం.

ఈ సారి కేంద్ర ప్రభుత్వం ప్రకటించ బోతున్న ఈ పద్మ అవార్డుల లిస్టులో దాదాపు వివిధ రంగాలలోని 148 మంది ప్రముఖులకు ఈ పద్మ అవార్డులకు ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి. పద్మ విభూషణ్ పురస్కారాలకు సంబంధించి రజినీకాంత్ తో పాటుగా బాలీవుడ్ టాప్ హీరో అమితాబ్ పేరును కూడా ప్రకటించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

వీరిద్దరితో పాటు బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, సల్మాన్ ఖాన్ తండ్రి రచయిత సలీం ఖాన్, సంగీత దర్శకడు అను మాలిక్ లు కూడా ఈ పద్మ అవార్డుల లిస్టులో ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే సంవత్సరం తమిళనాడులో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో రజినీకాంత్ తో మంచి సంబంధాలు మరింత పెంచుకునే ఉద్దేశ్యంతో కూడా రజినీకాంత్ కు ఈ అత్యున్నత పురస్కారం లభించింది అనే విశ్లేషణలు వినపడుతున్నాయి.

‘లింగ’ పరాజయంతో నిరాశలో ఉన్న రజినీకాంత్ అభిమానులకు ఈ వార్త మంచి జోష్ ను ఇస్తుంది అనడం లో ఎటువంటి సందేహం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: