ఫిలిం నగర్ లో కొన్నికొన్ని వార్తలు ఎలా పుట్టుకు వస్తాయో ఆధారాలు లేకపోయినా ఆ వినపడే గాసిప్పులకు చాలా లాజిక్ ఉంటుంది. ప్రస్తుతం ముచ్చటగా మూడవసారి త్రివిక్రమ్, మహేష్ లు మరోసారి సినిమా చేయడం వెనుక మెగా స్టార్ చిరంజీవి లాజిక్ ఉంది అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. మహేష్ తో త్రివిక్రమ్ సినిమాను చేసే ముందు రామ్ చరణ్ తో ఒక సినిమాను చేస్తాడు అనే వార్తలు గతంలో వచ్చాయి.

రామ్ చరణ్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ముచ్చట పడ్డా దర్శకుల పట్ల మెగా కాంపౌండ్ ప్రవర్తించే తీరు త్రివిక్రమ్ ను భయపెట్టింది అని టాక్. కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ రామ్ చరణ్ తో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమా స్క్రిప్ట్ విషయంలో కృష్ణవంశీ పై పరుచూరి గోపాలకృష్ణ సలహాల అజమాయిషీ అదేవిధంగా సినిమా కథ ఎడిటింగ్ విషయంలో చిరంజీవి తరుచూ కలిపించుకోవడం లాంటి వార్తలు గతంలో బయటకు రావడంతో మెగా కాంపౌండ్ అంటే త్రివిక్రమ్ భయపడ్డాడు అని అంటారు.

అదేవిధంగా జూనియర్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి రాయబారాలు నడిపినా కథ విషయంలో జూనియర్ వేలు పెట్టే వ్యవహారం త్రివిక్రమ్ ను జూనియర్ వేపు కూడా వెళ్ళకుండా చేసింది అని టాక్. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో ఒకసారి ఓకె అన్న తరువాత ఏ విషయంలోనూ వేలు పెట్టని మహేష్ తో జత కట్టడం మంచిదని భావించిన త్రివిక్రమ్ మహేష్ తో మూడవ సారి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అనే వార్తలు వినపడుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథకు మహేష్ ఓకె చెప్పడంతో మహేష్ ను ఇప్పటి వరకు చూడని ఒక వెరైటీ పాత్రలో త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోతున్న కొత్త సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: