సరిగ్గా 18 ఏళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా, రాముడిగా నటించిన ‘బాలరామాయణం’ సినిమా ప్రారంభo అయిన తేదీని సెంటిమెంట్ గా తీసుకుని నిన్న నందమూరి వంశానికి చెందిన నాల్గవ తరం నటుడు మాస్టర్ తారకరామారావు నటిస్తున్న ‘దాన వీర శూర కర్ణ’ సినిమా ప్రారంభం కావడంతో నందమూరి నాల్గవ తరానికి చెందిన సినిమాలకు కౌంట్ డౌన్ మొదలైంది.

స్వర్గీయ నందమూరి జానకి రామ్ తనయుడు మాస్టర్ తారక రామారావు పాటు తమ్ముడు సౌమిత్రి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. నిన్న ఈ సినిమా ప్రారంభోత్సవంలో జూనియర్ ఎన్టీఆర్ క్లాప్ కొడితే తాత హరికృష్ణ మొదటి సీన్ కు దర్శకత్వం వహించారు. ఆనాటి ‘దాన వీర శూర కర్ణ' స్థాయికి తగ్గకుండా లేటెస్ట్ టెక్నాలజీ తో ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ తో ఈసినిమాను నిర్మాణం చేస్తున్నారు.

ఈ సినిమాను స్పీడ్ గా పూర్తిచేసి ఎన్టీఆర్ జన్మదినాన్న మే 28న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్. ఈ సినిమాలో మాస్టర్ ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో నటిస్తుండగా, సహదేవుడిగా, కుచేలుడిగా అతడి సోదరుడు సౌమిత్రి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నందమూరి తారకరామారావు నటనా జీవితంలో ఒక క్లాసిక్ గా మిగిలి పోయిన ఈ సినిమాను మళ్ళీ నిర్మింప చేసి నటించాలని జూనియర్ ఎప్పటి నుంచో కలలు కంటున్నా విషయం తెలిసిందే.

అయితే జూనియర్ కలలను అతడి సోదరుడి కుమారుడు నెరవేరుస్తూ ఉండటమే కాకుండా నందమూరి నాల్గవ తరానికి నాంది పలకడంతో మరో మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమాలలో నందమూరి వంశ హవా కోసనాగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: