టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ బాహుబలి. ఇప్పటి వరకూ తెలుగులో రానంత హై బడ్జెట్ మూవీగా ఇది తెరకెక్కుతుంది. అంతే కాకుండా రెండు భాగాలుగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మొదట బాహుబలి మూవీని ఒకే భాగంతో సరిపెట్టుకోవాలని చూసినా, తరువాత మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన తరువాత, దీనికి రెండు భాగాలుగా రిలీజ్ చేస్తేనే అటు బిజినెస్ పరంగానూ, ఇటు మూవీ పరంగానూ సేఫ్ అనుకున్నారు. దీంతో బాహుబలి రెండు భాగాలుగా రిలీజ్ అవుతుంది. బాహుబలి మొదటి పార్ట్ షూటింగ్ చివరి దశలో ఉంది. మొదటి పార్ట్ కి సంబంధించిన టాకీ పార్ట్ దాదాపు పూర్తయ్యింది. అయితే బాహుబలిలో కూడ పాటలు ఉండటంతో, ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ మిగిలి ఉన్నాయి. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమా టెక్నికల్ టీంలో పని చేస్తున్నారు. ఈ మూవీకి ఉపయోగించిన భారీ సెట్స్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని సైతం ఆకట్టుకుంటుంది. హాలీవుడ్ టెక్నిషియన్స్ క్రియేట్ చేసే విజువల్ ఎఫెక్ట్స్ వండర్ ఫుల్ గా వచ్చాయని చిత్ర యూనిట్ నుండి అందిన సమాచారం. ఇండియా, హాంక్ కాంగ్, యుఎస్ కి చెందినా 6 విఎఫ్ఎక్స్ టీమ్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అనుష్క, ప్రభాస్, రానాలు బాహుబలి మూవీలో లీడ్ రోల్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: