టాలీవుడ్ లో పక్కా కాన్ఫిడెంట్ తో రిలీజ్ అయిన మూవీ పటాస్. బాక్సాపీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయం అంటూ పటాస్ మూవీపై నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తను అనుకున్నట్టే పటాస్ మూవీ, థియోటర్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ ‘పటాస్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ప్రీ రిలీజ్ నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని అంటున్నారు. అంతే కాకుండా మొదటి రోజు కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం భీమవరంలో పటాస్ మూవీ అత్యధిక కలెక్షన్స్ సాధించినట్టుగా తెలుస్తుంది. దాదాపు 2.25 లక్షలు భీమవరంలో పటాస్ మూవీకి మొదటి రోజు కలెక్షన్స్ నమోదు అయ్యాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా పటాస్ మూవీ దాదాపు 5 కోట్ల రూపాయలను కొల్లగొట్టిందంటూ ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో పాటు ఇండియాలోని ఇతర ప్రాంతాలని కలుపుకుంటే పటాస్ మూవీ దాదాపు 4 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని టచ్ చేసింది. ఓవర్సీస్ లో ఈ మూవీ 80 లక్షల వరకూ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. మొత్తంగా ఓవరాల్ కలెక్షన్స్ ని కలుపుకుంటే 5 కోట్ల మార్క్ ని టచ్ చేయవచ్చని ట్రేడ్ రిపోర్ట్. 

మరింత సమాచారం తెలుసుకోండి: