ప్రస్తుతం కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హన్సిక హావ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే హన్సిక చేస్తున్న మూవీల సంఖ్య, అందరి హీరోయిన్స్ కంటే ఎక్కువుగా ఉన్నాయి. 2014లో దాదాపు నాలుగు చిత్రాలలో నటించిన హన్సిక, 2015లోనూ అంతకంటే ఎక్కువ మూవీలకు కమిట్మెంట్స్ ఇచ్చుకుంది. 2014లో తను నటించిన చిత్రాలు అన్నీ బాక్సాపీస్ వద్ద బంపర్ హిట్ సాధించినవే. ఆ సక్సెస్ కారణంగానే చాలా మంది హీరోలు, దర్శకులు హన్సికని వారి మూవీలలోకి హీరోయిన్ గా తీసుకున్నారు. 2015లో హన్సిక చేస్తున్న మూవీలు వాలు, రోమియో జూలియట్, అంబాల, పులి, వెట్టై మన్నమ్, ఇవి కాకుండా మరో రెండు మూవీలు ప్రి ప్రొడక్షన్ ని జరుపుకుంటున్నారు. 2015లో సమంత, అనుష్క వంటి హీరోయిన్స్ కోలీవుడ్ లో పాగా వేయాలని చూశారు. కాని వారి ఆలోచనల కంటే ముందుగానే హన్సిక అత్యధిక మూవీలకి గ్రీన్స్ సిగ్నల్స్ ఇచ్చి, ఇతర హీరోయిన్స్ కి అవకాశాలు లేకుండా చేసింది. కేవలం ఎక్కువ మూవీలలో నటించటమే కాకుండా, తన రెమ్యునరేషన్ ని సైతం దాదాపు 60 శాతం పెంచిందట. ఇప్పటి వరకూ హన్సికకు కోటిన్నర రూపాయలను రెమ్యునరేషన్ గా ఇస్తున్న నిర్మాతలు, ఇక నుండి రెండున్నర కోటిరూపాయలకు పైగానే హన్సికకి రెమ్యునరేషన్ గా ఇస్తున్నారంట. మొత్తానికి హన్సిక తనకి వస్తున్న ఆఫర్స్ తో తెగ సంతోషంగా ఉన్నట్టుగా తన సన్నిహితుల వద్ద చెప్పుకొస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: