తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ ఎవ్వరూ కనపడరు. ఒకవేళ కనిపించినా పెద్దగా ఫోకస్ అవ్వరు. అంతే కాకుండా వీరికి బడా హీరోల సరసన ఆఫర్స్ అనేవి అంతగా ఉండవు. అటువంటి వారి లిస్ట్ లో కలర్ స్వాతి ఒకరు. తనకు టాలెంట్ ఉన్నప్పటికీ, తెలుగులో పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. కాని కోలీవుడ్ మార్కెట్ లో మాత్రం కలర్ స్వాతికి మంచి పేరే ఉంది. ఒక్క పేరు మాత్రమే కాకుండా బాక్సాపీస్ వద్ద మంచి డిమాండ్ కూడ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా కలర్ స్వాతి లీడ్ రోల్ గా తెలుగులో ఓ మూవీ తెరకెక్కబోతుంది. కలర్ స్వాతి ఇప్పటి వరకూ నటించిన మూవీలు ఓ ఎత్తైతే, ఇప్పుడు తను నటించబోతున్న మూవీ ఓ ఎత్తు. అయితే కలర్ స్వాతి మాత్రం తనుకు వచ్చిన ఆ ఆఫర్ కి సంతోషపడటమే కాకుండా తన రెమ్యునరేషన్ ని కూడ భారీగా పెంచేసిందట. తను ఆ మూవీ చేస్తే దాదాపు సంవత్సరం కాల్షీట్స్ ప్రత్యేకంగా ఆ మూవీ కోసమే కేటాయించాలట. అందుకే తనకి రెమ్యునరేషన్ ట్రిపుల్ ఇస్తేనే తను ఆ ప్రాజెక్ట్ లో చేస్తానని క్లియర్ గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కలర్ స్వాతికి ఇస్తున్న రెమ్యునరేషన్ 30 లక్షల నుండి 60 లక్షల వరకూ ఉంటుంది. కాని కలర్ స్వాతి లీడ్ రోల్ లో చేయబోతున్న ఫిల్మ్ కి, తను డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ కోటి రూపాయల 80 లక్షలు. కలర్ స్వాతి ఒక్కసారిగా ఇంత రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసే సరికి, నిర్మాతలు భయపడిపోయారు. 90 లక్షలకు చేస్తానంటే సిద్ధంగా ఉన్నామని నిర్మాతలు కోరగా, అందకు కలర్ స్వాతి ఏ మాత్రం ఒప్పుకోవడం లేదంట. ప్రస్తుతం రెమ్యునరేషన్ విషయలో ఈ ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉంది. కలర్ స్వాతి అయితేనే ఆ పాత్రకు సరిపోతుందని నిర్మాతులు, దర్శకులు తనతో బేరసారాలు ఆడుతున్నారు. మొత్తానికి కలర్ స్వాతి రెమ్యునరేషన్ తగ్గించుకొని ఆ మూవీలో నటిస్తుందో? లేదో? తెలియాలంటే మరికొంత సమయం వెయిట్ చెయ్యాల్సిందే అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: