నయనతార బాలకృష్ణల మధ్య కెమిస్ట్రీ బాగా కుదరడంతో వీరిద్దరూ గతంలో నటించిన సినిమాలు మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఆ సినిమాలు హిట్ లిస్టులో చేరాయి. ముఖ్యంగా బాలకృష్ణతో ఈమె నటించిన శ్రీరమరాజ్యంలో సీతాదేవిగా నయన తారను చూసిన విమర్శకులు కూడా వీరిద్దరి జంటకు మంచి మార్కులు వేసారు.

ఈ విషయం ఇలా ఉండగా బాలకృష్ణ నటించబోతున్న 99వ సినిమా గురించి ఒక ఆశక్తికర వార్త హడావిడి చేస్తొంది. ‘లౌక్యం’ ఫేమ్ శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్నఈ సినిమా ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో సెట్స్‌ పైకి వెళ్లబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.అయితే ఫిలిం నగర్ లో వినపడుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య పక్కన హీరోయిన్ గా నయన తారను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

‘లయన్’ షూటింగ్ ఇంచు మించు పూర్తి కావడంతో ఈ సినిమాను వెంటనే మొదలు పెట్టి పూర్తిచేసి ఆతరువాత తన 100 వ సినిమా గురించి ఆలోచనలు చేయాలని బాలయ్య ఆలోచిస్తున్నట్లు టాక్.

కోన వెంకట్ గోపి మోహన్ కలిసి కధను అందిస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది అని ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి. మొట్టమొదటిసారిగా ఈరోస్ సంస్థ బాలకృష్ణ సినిమాను పంపిణీ చేస్తున్నట్లు వార్తలు రావడంతో ఈ సినిమా ప్రారంభం కాకుండానే అంచనాలు పెంచేస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: