పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎందరో యువ హీరోలకు బ్రేకింగ్ గా మారింది. పవన్ కళ్యాణ్ సినిమా పాటలు, డైలాగ్స్, కటౌట్లు ఇలా పవన్ కు సంబంధించిన ఎదో ఒక విషయాన్ని తమ సినిమాలో చూపెట్ట కుండా సినిమాలు తీయలేకపోతున్నారు దర్శకులు. ఇప్పుడు ఈ లిస్టులోకి కళ్యాణ్ రామ్ కూడా చేరిపోయాడు. మొన్న విడుదలైన ‘పటాస్’ మొదటి రోజు మొదటి ఆట నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చు కోవడం వెనుక పవన్ సెంటిమెంట్ ఉంది అనే విశ్లేషణలు వస్తున్నాయి.

ఈ సినిమాలో వచ్చే ‘మదర్స్ ర్యాపిడ్ ప్రొటక్షన్ ఫోర్స్’ సన్నివేశాలకు సంబంధించి వచ్చే సీన్ లో పవన్ తన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో తన మేనత్త నదియా తో అన్న డైలాగ్ ‘కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కాని మేమున్నామని గుర్తించు’ డైలాగ్ ను యధా తదంగా పవన్ ను అనుకరిస్తూ కళ్యాణ్ రామ్ చెప్పడం పవన్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది అనే వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు ఈ మధ్య కాలంలో వచ్చిన చాల బ్లాక్ బస్టర్ సినిమాలలోని డైలాగ్స్ ను ‘పటాస్’ లో కళ్యాణ్ రామ్ రిపీద్ చేయడంతో ‘పటాస్’ అందరి హీరోల అభిమానులకు నచ్చిన సినిమాగా మారింది అనే వార్తలు వస్తున్నాయి. ఎటువంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా వచ్చిన ఈ సినిమా ఈ సంవత్సరపు మొట్టమొదటి కమర్షియల్ సక్సస్ సినిమాగా మారడం కళ్యాణ్ రామ్ అదృష్టం అనుకోవాలి.

దీనికి ఉదాహరణ ఈ సినిమాకు తొలి రోజు కోటి ౭౩ లక్షలు షేర్ రావడం టాలీవుడ్ పండితులను ఆశ్చర్య పరుస్తోంది. ఏమైనా దశాబ్ద కాలం తరువాత అదృష్టం కళ్యాణ్ రామ్ ఇంటి తలుపు తట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: