చిరంజీవికి, రాజశేఖర్ కు మధ్య అఘాదం ఉంది అన్న విషయం ఓపెన్ సీక్రెట్. అయితే వీరిద్దరూ త్వరలో కలుస్తున్నారు అంటే అది నిజంగా మీడియాకు హత న్యూస్. అయితే ఈ వార్తలను స్వయంగా రాజశేఖర్ లీక్ చేయడంతో ఇప్పుడది సంచలనంగా మారింది. ఈరోజు ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజశేఖర్ ఈ విషయాన్ని లీక్ చేసాడు. ఈ మధ్య కాలంలో ఏ పండుగ వచ్చినా తన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తన కెరియర్ బాగాలేదు అన్న బాధతో ఎదో వెలితి అనిపించేదని చెపుతూ త్వరలో తన కెరియర్ కు టర్నింగ్ పాయింట్ రాబోతోందని అభిప్రాయ పడుతున్నాడు రాజశేఖర్.

గత కొంత కాలంగా విజయాలకు దూరంగా ఉన్న తన సినిమా కెరియర్ కు ఫిబ్రవరిలో విడుదల కాబోతున్న తన ‘గడ్డం గ్యాంగ్’ సినిమా కెరియర్ బ్రేక్ ఇస్తుందని మంచి ఆశతో ఉన్నాడు రాజశేఖర్. అంతేకాదు తన కెరియర్ తన డబ్బు తన సంతోషం అంతా ఈ ‘గడ్డం గ్యాంగ్’ పైనే ఆధారపడి ఉండటంతో ఆ సినిమా సక్సస్ పై తన భవిష్యత్ ఆధారపడి ఉంది అన్న వాస్తవాన్ని గుర్తుకు చేసుకున్నాడు రాజశేఖర్.

నెగిటివ్ షెడ్స్ తో ఉండే విలన్ పాత్రలు తాను చేయడానికి సిద్దంగా ఉన్నాను అంటూ ఈ ఇంటర్వ్యూ ద్వారా సంకేతాలు ఇస్తున్నాడు రాజశేఖర్. ఇదే సందర్భంలో మరొక ఆశ్చర్యకరమైన విషయాన్ని షేర్ చేసుకున్నాడు ఒకనాటి యాంగ్రీ హీరో.

తనకు చిరంజీవికి మధ్య కొంత గ్యాప్ ఉన్న విషయం వాస్తవం అయినా నాగబాబు వల్ల ఆ గ్యాప్ బాగా తగ్గిందని త్వరలోనే తన ఇంటిలో జరిగే ఒక శుభకార్యానికి చిరంజీవిని పిలుస్తానని దానికి చిరంజీవి వస్తాడని తన నమ్మకం అంటూ ఓపెన్ కామెంట్ చేసాడు రాజశేఖర్. దీనిని బట్టి చూస్తుంటే త్వరలోనే వీరిద్దరూ మంచి స్నేహితులుగా మరే రోజులు వస్తున్నాయి అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: