తమపై వచ్చే విమర్శలను ఎదుర్కోవడంలో ఇన్ని రోజులూ టీఆర్ఎస్ చాలా తెగువ చూపింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనైనా... తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎన్నికలను ఎదుర్కొన్న సమయంలోనూ.. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్న తరుణంలోనూ... తెలంగాణ రాష్ట్ర సమితి వారు చాలా తెగువను చూపారు. అయితే ఇప్పుడిప్పుడు మాత్రం వారిలో ఆ తెగువ తగ్గుతోందని అనుకోవాల్సి వస్తోంది.

తాజాగా కేటీఆర్ మాటలు కూడా ఈ అభిప్రాయానికి ఒక కారణం అవుతున్నాయి. ఏడు నెలల పసిగుడ్డుపై ఎందుకు కక్షా పూరితంగా వ్యవహరిస్తారు? అంటూ ప్రశ్నిస్తున్నాడు కేటీఆర్. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి కేటీఆర్ ఈ మాటలు అన్నాడు. వారు చేస్తున్న విమర్శలపై స్పందనగా కేటీఆర్ ఈ అభిప్రాయాన్ని వినిపించాడు.

మరి అవతలి వారు ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించడం టీఆర్ఎస్ స్టైల్. విధానరమైన విషయాల్లోనైనా... వ్యక్తిగత విమర్శల విషయంలోనైనా... టీఆర్ఎస్ ఎదురుదాడికే ప్రాధాన్యతనిస్తుంది. అయితే కేటీఆర్ మాత్రం తమ ప్రభుత్వాన్ని పసిగుడ్డుగా అభివర్ణిస్తూ దానిపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రత్యర్థులను రాక్షసుల్లా చూపడానికి ప్రయత్నిస్తున్నాడు.

మరి ఇది కొత్త యాంగిల్ అని చెప్పవచ్చు. మరి ఇది వ్యూహాత్మకమైన యాంగిలా.. లేక నిజంగానే టీఆరఎస్ ఎదురుదాడి చేయలేక ఇలాంటి మాటలు మాట్లాడుతోందా? అనేదే సందేహం

మరింత సమాచారం తెలుసుకోండి: