శివాని-శివాత్మిక మూవీస్ పతాకంపై జీవితా రాజశేఖర్ నిర్మాణంలో రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘గడ్డం గ్యాంగ్’.అయితే ఫిబ్రవరి 4న రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంతోష్ పీటర్ జయకుమార్ ఈ మూవీకి దర్శకుడిగా చేశాడు. ఇదిలా ఉంటే రాజశేఖర్ తన పుట్టిన రోజు సందర్భంగా ఓ నిర్ణయం తీసుకోబోతున్నాడు. ఇప్పటి వరకూ హీరోగా అలరించిన రాజశేఖర్, ఇక నుండి విలన్ పాత్రలవైపు అడుగులు వేయబోతున్నాడు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వూలో తను ఈ విధంగా చెప్పుకొచ్చాడు. “ఈ వయసులో కూడా హీరో పాత్రలు చేస్తాననడం మూర్ఖత్వమే అవుతుంది. మల్టీస్టారర్స్, ఇతర హీరోల సినిమాలలో ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేయడానికి, విలన్ పాత్రలలో నటించడానికి నేను రెడీ. నాకు రెండు మూడు పెద్ద సినిమాల ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే, ఓ సక్సెస్ వచ్చిన తర్వాత వాటికి ఓకే చేద్దామని ఎదురుచూస్తున్నాను. సక్సెస్ లేక రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు అనిపించుకోవడం ఇష్టం లేదు. ‘గడ్డం గ్యాంగ్’ సక్సెస్ తర్వాత వాటి వివరాలు వెల్లడిస్తాను” అంటూ తన ప్యూచర్ ప్లానంగ్స్ ని చెప్పుకొచ్చాడు. దీంతో హీరో రాజశేఖర్ ని ఇక నుండి విలన్ పాత్రలతో చూడటానికి సినీ ప్రేక్రకులు సైతం ఆసక్తి చూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: