1990 ప్రాంతంలో టాలీవుడ్ కోలీవుడ్ సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఒక నాటి గ్లామర్ హీరోయిన్ సుకన్య మహేష్ బాబు తల్లిగా మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకు ప్రిన్స్ తల్లిగా రకరకాల పేర్లు ఇప్పటివరకు తెరపైకి వచ్చాయి.

అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఒక నాటి హీరోయిన్ సుకన్య ఈ పాత్రకు ఫైనల్ కావడం అందరికీ షాక్ ఇచ్చింది. గతంలో ఈ పాత్రకు ఒక నాటి హీరోయిన్ గ్రేసి సింగ్ పేరు వినిపించినా చివరకు ఈ అవకాశం సుకన్య కు దక్కడం వెనుక కారణం జగపతి బాబు అని టాక్

ఈ సినిమా లో జగపతి బాబు మహేష్ బాబు తండ్రి గా పాత్ర పోషిస్తున్న సందర్భoలో ఒకప్పుడు జగపతి బాబు పక్కన హీరోయిన్ గా నటించిన సుకన్య ఈ సినిమాలో కూడా జగపతి బాబు భార్యగా కనిపిస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ఈ ఎంపిక జరిగింది అని అంటున్నారు .

కారణాలు ఏమి అయినా సుకన్యకు బంపర్ ఆఫర్ తగిలింది అనుకోవాలి. ఇప్పటికే టాలీవుడ్ లో పెరిగి పోతున్న గ్లామర్ అమ్మల లిస్టులో సుకన్య ఎంత కాలం నిలబడగలుగు తుందో చూడాలి. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమా షూటింగ్ రకరకాల కారణాలతో ఆలస్యం అవుతూ ఉండటంతో ఈ సినిమా సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: