గత కొంత కాలంగా అశుభ వార్తలతో వేదన పడుతున్న టాలీవుడ్ సినిమా రంగానికి ఈరోజు ఒక మంచి వార్త వెలువడటంతో పండుగగా మారింది. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావుకు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. టాలీవుడ్ కు సంబంధించిన అతి కొద్ది మంది ప్రతిభా వంతులైన నటులలో కోటా శ్రీనివాసరావు ఒకరు.

ఆయన ఏ పాత్ర అయినా అవలీలగా నటించినట్లుగా మరి ఏ నటుడు నటించలేడు. విలన్ గా, తాతగా, తండ్రిగా, మావగా, రాజకీయ నాయకుడిగా ఇలా ఏ పాత్రలో అయినా ఒదిగి పోయి నటించడం ఆయనకే సొంతం. నాటక రంగం నుండి వచ్చిన అనుభవంతో గంభీరమైన గొంతుకతో కూడిన స్పస్టతతో డైలాగ్స్ చెప్పడం కోటకు వచ్చిన విధంగా మరే నటుడికి రాదు.

తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాల మాండళీకాలతో ఎన్నో పాత్రలు చేసిన ఘనత ఆయనది. ‘ప్రాణం ఖరీదుతో’ ప్రారంభించి, ఏడు వందల నిమాల్లో, వైవిధ్యమైన పాత్రలలో నటించి రోజుకు ఒక కొత్త విలన్ తెలుగు సినిమాకు పరిచయం అవుతున్నా తన స్థాయిని నిలుపు కుంటూ అచ్చమైన తెలుగు సినిమా విలన్ గా తన ఇమేజ్ ని కొనసాగిస్తున్న కోటా శ్రీనివాసరావుకు పద్మశ్రీ అవార్డు రావడం ఆయన ఖ్యాతిని మరింత పెంచుతుంది.

తెలుగు సినిమాలలో పర భాష విలన్స్ ను దిగుమతి చేసుకోవడం విషయం పై వ్యతి రేకంగా ఎప్పటి నుండో పోరాటం చేస్తున్న కోట శ్రీనివాసరావు పోరాటం విజయవంతం కాకపోయినా ఆయన మాటలు ఎప్పుడూ ఆలోచింప చేసీ విధంగానే ఉంటాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: