పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘బుజ్జిగాడు’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన సంజన ఆ తరువాత టాలీవుడ్ లో రెండు, మూడు సినిమాలలో నటించినా పెద్దగా చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. ప్రస్తుతం ఆమె రవిబాబు తీస్తున్న ‘అవును 2’ లో ఒక అతిథి పాత్ర చేస్తోందని టాక్.

అటువంటిది ఎక్కడా బుకుంగ్ లు లేని హీరోయిన్ లేటెస్ట్ గా 15 కోట్లు విలువ చేసే అపార్ట్ మెంట్ కొనుక్కున్నట్లుగా వార్తలు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. గత సంవత్సరం BMW కారు కొనుక్కుని వార్తలకు ఎక్కినా సంజన లేటెస్ట్ గా బెంగుళూరులో సంజన 15 కోట్ల ఖరీదైన ఇండిపెండెంట్ హౌస్‌లో ఫస్ట్ ఫ్లోర్ కొనేసిందట.

4000 చదరపు అడుగులు ఉండే ఈ ఇంటిని తనకు నచ్చినట్టు ఇంటీరియర్ వర్క్ చేయిస్తోందట. అంతేకాదు ఈ ఫ్లాట్ కు అత్యంత ఖరీదైన వెర్సీ టైల్స్ తో పాటు అత్యంత విలాసవంతమైన ఫర్నేచర్ కూడా సమకూర్చుకుని లీడింగ్ హీరోయిన్స్ కు షాక్ ఇచ్చింది సంజన. దీనితో బుకింగ్స్ లేని సంజన వెనుక గాడ్ ఫాదర్ ఎవరూ అంటూ? రకరకాల గాసిప్పులు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి.

దీనిని బట్టి చూస్తూ ఉంటే బుకింగ్స్ తో సంబంధం లేకుండా గాడ్ ఫాథర్ ఉంటే చాలు మన బ్యూటీలు ఏమైనా చేయగలరు అని సంజన విషయం మరోసారి రుజువు చేస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: