సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కాజల్ అగర్వాల్, టాలీవుడ్ లో ఓ మూవీలో నటిస్తుంది. అదే జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ టెంపర్. టెంపర్ ఫిల్మ్ లో జూనియర్ సరసన కాజల్ నటించడమే కాకుండా, టెంపర్ మూవీకి కాజల్ అందాలు సరికొత్త గ్లామర్ ని తెచ్చిపెడుతుందని పూరీ సైతం చెప్పుకొస్తున్నాడు. ఇదిలా ఉంటే టెంపర్ మూవీలో కాజల్ కి సంబంధించిన షెడ్యూల్ దాదాపు పూర్తయింది. దీంతో కాజల్ టెంపర్ మూవీను వదిలి మరో సరికొత్త మూవీకి సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటుంది. రీసెంట్ గా తను ఓ కోలీవుడ్ చిత్రానికి సైన్ చేసింది. విశాల్ హీరోగా, సుశీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఉంటుంది. వీరి కాంబినేషన్ కి సంబంధించిన షూటెంగ్ షెడ్యూల్ ఈ రోజు నుండి మరో వారం రోజుల పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. కాజల్ ప్రస్తుతం ఈ షూటింగ్ లో పొల్గొంటూ సందడి చేస్తుంది. మొత్తంగా కాజల్ వరుస చిత్రాలకి ముందుగా గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వకుండా, ఒక మూవీకి సంబంధించిచ షూటింగ్ పూర్తవ్వగానే మరొక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, తన ఫిల్మ్ కెరీర్ ని చక్కగా లీడ్ చేస్తుందని అంటున్నారు. సమ్మర్లో రిలీజ్ కాబోతున్న టెంపర్ మూవీ కాజల్ అగర్వాల్ భారీ హోప్స్ పెట్టుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: