తాజాగా హాలీవుడ్ రేంజ్ లో ఐ మూవీని తెరకెక్కించిన శంకర్, తన అప్ కమింగ్ ఫిల్మ్ కి సంబంధించిన పనులను శరవేగంగా ప్రారంభిస్తున్నాడు. ఓ వైపు ఐ మూవీకి సంబంధించి కలెక్షన్స్ భారీ స్థాయిలో ఉంటుంటే, మరో వైపు శంకర్ అప్ కమింగ్ ఫిల్మ్ ప్రాజెక్ట్ పై సినీ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే శంకర్ తన అప్ కమింగ్ ఫిల్మ్ ని అజిత్ తో చేస్తున్నట్టుగా కోలీవుడ్ వర్గాలు అధికారింగా ద్రువీకరించాయి. అజిత్ కూడ శంకర్ మూవీలో నటించేందుకు డేట్స్ ని రెడీ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉంది. అనంతరం ఇందులో నటించే స్టార్ కాస్టింగ్ ల ఎంపిక జరుగుతుందని శంకర్ టీం నుండి వినిపిస్తున్న సమాచారం. కోలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, శంకర్-అజిత్ కాంబినేషన్ లోవస్తున్న మూవీలో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే శంకర్ టీం గత వారం ఐశ్వర్య రాయ్ ని కలిసి, అజిత్ మూవీలో నటించాల్సిందిగా కోరారు అంట. అందుకు ఐశ్వర్య రాయ్ చూద్ధాం, తరావాత చెబుతాను అనే మటలు మాట్లాడటంతో, శంకర్ టీం తన వద్ద నుండి క్లారిటి ఆన్సర్ కావాలని కోరింది. అందుకు ఐశ్వర్య రాయ్ ఇప్పట్లో మూవీలో నటించే ఉద్ధేశం లేదని క్లారిటి ఇచ్చేసింది. దీంతో శంకర్-అజిత్ కాంబినేషన్ లో ఐశ్వర్య రాయ్ నటించడం లేదనేది కోలీవుడ్ లో వినిపిస్తున్న టాక్స్. ఈ న్యూస్ ని శంకర్ టీం ఇంకా అఫిషియల్ బయటకు చెప్పలేదు. దీంతో ఐశ్వర్య రాయ్, శంకర్ మూవీలో నటిస్తుంది అనే వార్తలనే ప్రచారంలో ఉంచుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: