పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ గబ్బర్ సింగ్2. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల మూవీ లాభాలతో ధియోటర్స్ వద్ద ప్రదర్శించబడుతుంది. దీంతో మంచి ఊపుమీద ఉన్న పవన్ కళ్యాణ్, వెంటనే గబ్బర్ సింగ్2 కి సంబంధించిన మూవీని స్టార్ట్ చేస్తాడని అందరూ అనుకున్నారు. నిజానికి గబ్బర్ సింగ్ 2 మూవీ ఫిబ్రవరి మొదటి వారంలో సెట్స్ మీదకు వెళ్ళాలి. కాని ఇప్పటి వరకూ ఆ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లాలనే కమాండ్స్ ఎవరి వద్ద నుండి రాలేదంట. దీంతో అసలు పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్2 స్టార్ట్ చేసే ఉద్ధేశం ఉందా? లేదా? అంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. అలాగే గబ్బర్ సింగ్2 లో కొన్ని కీలక పాత్రలకు స్టార్ కాస్టింగ్ ఎంపిక జరగాల్సి ఉంది. కాని పవన్ కళ్యాణ్ మాత్రం ఆ విషయంలో ఏ మాత్రం ఆసక్తి చూపటం లేదంట. దీంతో గబ్బర్ సింగ్2 చిత్రయూనిట్ లో మరోసారి డైలమా మొదలైంది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్2 ని ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ అనుకున్నప్పటికీ, ఈ మూవీపై త్వరితమైన నిర్ణయాలను మాత్రం పవన్ కళ్యాణ్ తీసుకోవడం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మరో వైపు గబ్బర్ సింగ్2 ని కొంత కాలం ఆపేద్ధాం అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. గోపాల గోపాల మూవీ డైరెక్టర్ తో తను హీరోగా వెంటనే ఓ మూవీని స్టార్ట్ చేయటానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: