టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా స్టార్ డం ని సొంతం చేసుకున్న హీరో ప్రిన్స్ మహేష్ బాబు. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న మూవీ శ్రీమంతుడు. ఈ మూవీ తరువాత మహేష్ బాబు మరో మూడు మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇవి కాకుండా దాదాపుగా మరో 8 మూవీలు తన గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో మహేష్ బాబు కాల్సీట్స్ దొరకటం అనేది అతి పెద్ద విషయంగా మారింది. ఇదిలా ఉంటే గతంలో బడా నిర్మాతలకు కాల్షీట్స్ ఇచ్చిన ప్రిన్స్, తరువాత ఆ కాల్షీట్స్ ని క్యాన్సిల్ చేయటమే కాకుండా, ఏకంగా ఆ మూవీ నుండే తప్పుకున్నాడు. గతంలో యు.టి.వి మోషన్ పిక్ఛర్స్ తో టై అప్ పెట్టుకున్న ప్రిన్స్, ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకొని, కొరటాల శివ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు కొరటాల శివ మూవీ తరువాత, బ్రహ్మోత్సవం అంటూ శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో నటించేందుకు రెడీ అయ్యాడు. ఆ తరువాత పి.వి.పి బ్యానర్ లో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే బండ్ల గణేష్ మూవీకి సైతం ప్రిన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే మరో వైపు త్రివిక్రమ్, పూరీ జగన్నాధ్ మరోసారి ప్రిన్స్ తో జతకట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరిలో ఎవరి ప్రాజెక్ట్ అయినా ఓకే అయితే, ఇక మిగతా ప్రొడ్యూజర్స్ పరిస్థితి ఏమిటో అస్సలు అర్ధం కావడం లేదు. అయితే ప్రిన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లో ట్విస్ట్ ఏమిటి అంటే, తను ఏ మాత్రం కథ విషయంలో ఇష్టం లేకపోయినా, ఆ ప్రాజెక్ట్ నుండి చివరి నిముషంలో అయినా తప్పుకోవటానికి సిద్ధమే అని చెప్పుకొస్తున్నాడంట. దీంతో ప్రొడ్యూజర్స్ తెగ హైరానా పడుతున్నారు. వారు ఎంతో కష్టపడి తెచ్చుకున్న కాల్షీట్స్ ని ఏ కారణంతో రిజెక్ట్ చేస్తాడో అంటో నిర్మాతలు అయోమయంలో ఉన్నారంట. 

మరింత సమాచారం తెలుసుకోండి: