నిన్నటి రోజున జరిగిన ‘టెంపర్’ ఆడియో వేడుకలో ఆసినిమాలో నటించకపోయినా వేదిక పైకి వచ్చి సందడి చేసింది చార్మి. అయితే కొత్త లుక్ లో కనిపిస్తున్న ఛార్మి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన ఉదయభాను మరో అడుగు ముందుకు వేసి ఛార్మి లుక్ ను పొగుడుతూ పరభాషల నుండి ఐటమ్ గర్ల్స్ ను తెచ్చుకునే బదులు ఆ అవకాశాలు ఛార్మికి ఇవ్వచ్చుకదా అంటూ వేదిక పై నుంచి పూరీని ప్రశ్నించింది ఉదయభాను.

నటిగా మంచి పేరు ఉన్నా ఇప్పటికే 50 సినిమాల వరకు నటించినా ఛార్మీకి రావలసినంత క్రేజ్ రాలేదు అన్నది వాస్తవం. ఎదో విధంగా తిరిగి తన హవా చాటడానికి ఛార్మీ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. దానికోసమే ఇలా నాజుకుగా తయారైంది అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే నిన్న ఆడియో వేడుకకు వచ్చిన అతిధులు మాత్రం ఛార్మీ కొత్త అవతారాన్ని చూసి మరో విధంగా కామెంట్ చేసుకున్నారు.

త్రిష నిశ్చితార్ధం రోజున చెన్నై వెళ్ళిన ఛార్మీ కొత్త లుక్ చూసి త్రిష ముచ్చట పడి తన పెళ్ళిలో జరగబోయే మెహందీ ఉత్సవంలో డాన్స్ లు చేయమని కోరిందని వార్తలు వచ్చిన నేపధ్యంలో ఛార్మీ స్లిమ్ లుక్ సినిమాలలో అవకాశాలు ఇప్పించలేకపోయినా త్రిష పెళ్ళిలో డాన్స్ చేసే చాన్స్ లు ఇప్పించింది అంటూ కొంతమంది సెటైర్లు వేసుకున్నారని టాక్.

ఏది ఎలా ఉన్నా నిన్నటి ఆడియో వేడుకలో కాజల్ లుక్ కన్నా ఛార్మీ లుక్ అందర్నీ ఆకర్షించడంతో ఆ కార్యక్రమానికి వచ్చిన ఎవరో ఒకరు దర్శక నిర్మాతలు చార్మీకి అవకాశాలు ఇస్తారేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: