సూపర్ స్టార్ రజనీకాంత్ జీవితంలో ఉన్న ట్విస్టులు చాల కొద్దిమంది సెలెబ్రెటీల జీవితాలలో ఉంటాయి. దక్షిణాది సినిమా రంగాన్ని శాసించే స్థాయికి ఆయన ఎదిగినా ఇంకా నటన విషయంలో తనకు ఏమి తెలియదు అని చెప్పడం రజినీకాంత్ సంస్కారం. అటువంటి సూపర్ స్టార్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకుని నిర్మించిన సినిమాయే ‘షమితాబ్’ మూవీ అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది.

అంతేకాదు రజినీ రియల్ లైఫ్ లో జరిగిన విషయాలే రీల్ లైఫ్ గా షమితాబ్ లో రజినీ అల్లుడు ధనుష్ నటిస్తున్నాడు అంటూ ప్రచారం మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కూడా ముందు హీరో ధనుష్ ఒక సాధారణ బస్సు కండక్టర్.

అయితే అతడు అనుకోకుండా బాలీవుడ్ హీరోగా ఈ సినిమాలో మారిపోతాడు. ఈ నేపధ్యంలో జరిగే సంఘటనలకు రజినీకాంత్ జీవితంలో జరిగిన విషయాలకు సారూప్యం ఉందని బాలీవుడ్ మీడియా ఊహాగానాలు చేస్తోంది. మొదట్లో ఈ సినిమాకు హీరోగా షారుఖ్ ఖాన్ ను అనుకున్నా అనుకోకుండా ధనుష్ వచ్చి చేరడం అతడి కెరియర్ కు బాలీవుడ్ లో పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని అంటున్నారు.

ఈ సినిమాలో అమితాబ్ ఇందులో షరాబీగా కనిపించనున్నారు. క్లైమాక్స్‌‌‌లో ఆయన చెప్పిన డైలాగులు సెట్స్‌‌లోనే అందరి కళ్ళలో నీళ్ళు తెప్పించాయని కథనాలు రాస్తోంది బాలీవుడ్ మీడియా. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విపరీతంగా ఆదరణ పొందడంతో పాటు కమల్ కూతురు అక్షరహాసన్ గ్లామర్ ఈ సినిమాకు మరింత అంచనాలు పెంచేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: