ఈమధ్య కాలంలో హీరోయిన్స్ పబ్ లలో చిందులు వేసారు అంటూ వార్తలు రావడం సర్వ సాధారణం అయింది. ఈ వార్తలను మీడియా ప్రముఖంగా రాస్తూ ఉంటే ఆ మరునాడే ఈ వార్తలను ఖండిస్తూ హీరోయిన్స్ మీడియాకు ప్రకటనలు ఇస్తున్నారు. కాని అప్పటికే జరగవలసిన ప్రచారం జరిగి పోవడంతో ఈ ఖండనను ఎవరు పట్టించుకోవడంలేదు.

ఇక లేటెస్ట్ గా ఇటువంటి వార్తలలోకి హీరోయిన్ సంజన వచ్చి చేరింది. ఈ మధ్యనే 15 కోట్ల అపార్ట్ మెంట్ కొనుక్కుని వార్తలలోకి ఎక్కిన సంజన మరో సంచలన వార్తలో నిలిచింది. ఈ కన్నడ హీరోయిన్ కల్లు తాగుతూ మీడియాకు దొరికిపోయింది అంటూ ప్రచారం మొదలైంది.

సంజన ఒక తాటి దొప్పలో తాగుతున్న ఫోటో ఒకటి ఇప్పుడు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ తాటి దొప్పలో సంజన తాగుతున్నది నిజంగా కల్లేనా? లేదంటే సరదాకి అలా కెమేరాకు ఫోజులు ఇచ్చిందా అనే విషయం పై క్లారిటీ లేదు.

అసలు ఈ ఫోటో ఎవరు ఎక్కడ తీసారు అన్న విషయం పై కూడా క్లారిటీ లేదు. కానీ ఈ ఫోటో మాత్రం వెబ్ మీడియాకు టాపిక్ ఆఫ్ దిడే గా మారింది. ఇంతకీ సంజన ఆ దొప్పలో పోసుకుని ఏమి తాగిందో ఆమెకే తెలియాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: