ఈరోజు ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రహ్మానందం తన పై తాను వేసుకున్న సెటైర్ టాపిక్ ఆఫ్ దిడే గా మారింది. గిన్నీస్ బుక్ లో స్థానం పొందిన తన క్రేజ్ గురించి మాట్లాడుతూ ఎందరు కొత్త హాస్య నటులు వస్తున్నా తన ముఖం మాత్రం తెలుగు ప్రేక్షకులకు బోర్ అనిపించదని చెపుతూ ‘కొత్తనీళ్ళు వచ్చి పాత నీళ్ళు పోతున్నట్టే, కాని గట్టుకు ఉన్న పాచి మాత్రం ఉంటుంది ఎప్పుడూ అలానే’ అంటూ తనను ఏ నూతన హాస్య నటుడు తనను మరిపించలేడని తన పై తానే షాకింగ్ కామెంట్స్ చేసుకున్నాడు బ్రహ్మి.

తనను ఈ ప్రపంచంలోకి జనాన్ని నవ్వించడానికే భగవంతుడు జోకర్ గా పుట్టించాడని ఇది ముందుగా ఊహించే కాబోలు తన తల్లితండ్రులు తనకు బ్రహ్మానందం (విశ్వానికి ఆనందాన్ని ఇచ్చేవాడు) అని అర్ధం వచ్చే పేరును పెట్టారని అభిప్రాయ పడ్డాడు బ్రహ్మనందం.

అంతేకాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకసారి తనతో మాట్లాడుతూ భగవంతుడి దర్శనం కోసం గంటలు తరబడి క్యూలో నుంచుని ఆ దేవుడిని చూసిన తరువాత ఎటువంటి ఆనందాన్ని పొందుతారో తనను వెండి తెర పై చూసినప్పుడు ప్రేక్షకులు అటువంటి ఆనందాన్ని పొందుతారు అని పోగిడినప్పుడు తనకు ఆనందం అనిపించడమే కాకుండా భగవంతుడు తనచేత చేయిస్తున్న పాత్రను సమర్ధవంతంగా పోషిస్తున్నాను అనే అభిప్రాయం కలిగింది అని అన్నాడు.

అదేవిధంగా ఇదే ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకుంటూ త్వరలోనే తన జీవిత చరిత్రను తాను రాయబోతున్నానని ఆ పుస్తకంలో తనకు వ్యక్తిగతంగా భగవంతుడితో కలిగిన అనుభవాలను అందరితోను పంచుకోవాలని భావిస్తున్నట్లు తెలియచేసాడు బ్రహ్మి. దీనిని బట్టి చూస్తూ ఉంటే భవిష్యత్తులో సినిమాలు తగ్గిపోయినా భగవంతుడితో తన అనుభవాలను వివరించే ఆధ్యాత్మక ఉపాధ్యాయుడిగా బ్రహ్మి మారిపోయే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: