బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంకా చోప్రాకు ఒక టెలివిజన్ షో చేసినందుకు మూడు నెలలలో 25 కోట్లు పారితోషికంగా రావడం బాలీవుడ్ లో సంచలన వార్తగా మారింది. అమెరికాలో పేరు పొందిన ఏబీసీ టెలివిజన్ స్టూడియో నిర్మిస్తున్న ‘మోడ్రన్ ఫ్యామిలీ’ అనే టెలివిజన్ సీరియల్ లో నటిస్తున్నందుకు ప్రియాంకకు ఈ భారీ పారితోషికం లభిస్తోంది. ఈ సీరియల్ కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూ తిరగడంతో ప్రియాంకకు ఈ భారీ పారితోషికం ఇస్తున్నట్లు టాక్.

ఈ సీరియల్ షూటింగ్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరుగుతూ ఉండటంతో దాదాపు 3 నెలల షూటింగ్ కోసం ఆమె ఉన్నన్నాళ్ళు లాస్ ఏంజిల్స్ లో ఒక విలాసవంతమైన భవనంలో ఆమె అతిధిగా ఉండబోతోంది. అంతేకాదు ఆమె ప్రతిరోజు పూజ చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన పూజ గదిని కూడా ఏర్పాటు చేస్తున్నారు.

అదేవిధంగా ఆ ఇంటిలో ప్రతిచోటా ప్రియాంక కుటుంబ సభ్యుల ఫోటోలను కూడా పెడుతూ చూసే వాళ్లకు అది ప్రియాంక సొంత ఇల్లు అని అనిపించేడట్లుగా చేస్తున్నారట. ఈ అమెరికన్ షోతో ప్రియాంక అంతర్జాతీయంగా పేరు తెచ్చు కోవడం ఖాయం అని వార్తలు రాస్తోంది బాలీవుడ్ మీడియా.

‘మేరీకోమ్’ పాత్రలో ఈమె కనపరిచిన విశేష ప్రతిభను చూసి ఈ భారీ ఆఫర్ అమెరికన్ తెలివిజన్ కంపెనీ ఆఫర్ చేసిందని టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: