జూనియర్ అభిమానులు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ పేరు వింటేనే మండి పోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం వారు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘టెంపర్’ లోని పాటలు జూనియర్ అభిమానులను మెప్పించలేక పోవడమే అని టాక్. ‘మనం’, ‘గోపాల గోపాల’ వంటి సినిమాలకు మంచి మ్యూజిక్ ని ఇచ్చిన అనూప్ ‘టెంపర్’ విషయంలో తన స్థాయిని చూపించుకోలేదు అని యంగ్ టైగర్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు.

అంతేకాదు సంగీత దర్శకుడు తమన్ గతంలో విడుదలైన జూనియర్ సినిమాలకు ఇచ్చినట్లుగా రొటీన్ బాణీలను ‘టెంపర్’ లో పెట్టాడని దానితో ‘టెంపర్’ పాటలలో ఎటువంటి కిక్ లేకపోవడం ఈ సినిమా విజయం పై ప్రభావం చూపెడుతుందా అనే టెన్షన్ లో జూనియర్ అభిమానులు ఉన్నట్లు టాక్. ఒక రెండు పాటల ట్యూన్స్ హమ్మింగ్ చేయడానికి వీలుగా ఉన్నా మిగతా పాటలు అన్నీ మరీ తెలిపోయాయని జూనియర్ అభిమానుల వాదన.

అంతేకాదు ‘టెంపర్’ ట్రైలర్ లో ఉన్న కిక్ ఈ సినిమా పాటలలో కనిపించక పోవడంతో జూనియర్ ఎంత కష్టపడి స్టెప్స్ వేసినా ఫలితం ఏమిటి అని జూనియర్ అభిమానులు బాధ పడుతున్నారట. దీనితో ‘టెంపర్’ పాటలను సెల్స్ కు కాలింగ్ ట్యూన్స్ గా పెట్టుకునే వారి సంఖ్య కూడా తక్కువగానే ఉంది అనే వార్తలు వినపడుతున్నాయి.

ఒక కమర్షియల్ సినిమాకు మసాల ట్యూన్స్ ఇవ్వవలసిన అనూప్ తన సమర్ధతను నిరూపించుకోలేకపోయాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో అనూప్ హవాకు అప్పుడే చిన్న బ్రేక్ పడిందా? అనే సందేహం ఈ వార్తలు విన్నవారికి కలుగుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: