అతిలోక సుందరిగా దక్షిణాది సినిమా రంగాన్నే కాదు బాలీవుడ్ సినిమా రంగాన్ని కూడా ఒక మహారాణిలా ఏలిన శ్రీదేవి దాదాపు 14 సంవత్సరాల విరామం తరువాత నటించినా ఆమె క్రేజ్ ఏ మాత్రం చెదిరి పోలేదు అని రుజువు చేసుకుంది. అటువంటి శ్రీదేవి చాల గ్యాప్ తరువాత ప్రస్తుతం కోలీవుడ్ లో టాప్ హీరో విజయ్ కు అత్తగారిగా నటిస్తున్న ‘పులి’ సినిమా ఇప్పుడు టాపిక్ ఆఫ్ కోలీవుడ్.

ఇప్పటి వరకు విజయ్ సినిమాకు ఖర్చు చేయని విధంగా అత్యంత భారీ బడ్జెట్ తో తీసుతున్న ఈ ఫ్యాంటసీ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా నటిస్తున్న హాన్సికకు తల్లిగా నటిస్తోంది. అయితే అటువంటి శ్రీదేవికి హన్సిక అనుకోని షాక్ ఇచ్చింది అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా యూనిట్ మిస్ మేనేజ్ మెంట్ వల్ల శ్రీదేవికి తీవ్ర అసౌకర్యం కలిగింది అని టాక్.

ఇక వివరాలలోకి వెళితే ఈ సినిమా షూటింగ్ లో తన షాట్ కోసం మేకప్ చేసుకుని రెడీ అయి వచ్చిన శ్రీదేవికి హన్సిక పుణ్యమా అని తన షాట్ కంప్లీట్ చేయడానికి నాలుగు గంటలు ఎదురు చూడవలసి వచ్చిందట. ఆ రోజు టైమ్ కు రావలసిన హన్సిక నాలుగు గంటలు లెట్ గా ఆ షూటింగ్ స్పాట్ కు రావడం వల్ల ఈ అసౌకర్యం కలిగింది. ఈ పరిస్థుతులలో శ్రీదేవి, తమను ఎంత గట్టిగా తిట్టి పోస్తుందో అని భయపడిందట ఆ సినిమా యూనిట్.

అయినా శ్రీదేవి ఎటువంటి చిరుకోపాన్ని కూడా ప్రదర్శించకుండా ఆ సినిమా యూనిట్ తో కబుర్లు చెపుతూ ఆ నాలుగు గంటలు గడిపేసరికి శ్రీదేవి ది గ్రేట్ అంటూ ఆ సినిమా యూనిట్ ఆమెను ప్రశంసలతో ముంచెత్తి వేసిందని వార్తలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: