శాండిల్ ఉడ్ హీరోయిన్ సంజన ఎప్పుడూ ఎదో ఒక షాకింగ్ న్యూస్ కు కేంద్ర బిందువుగా ఉంటూ పెద్దగా సినిమాలు లేకపోయినా తన పాపులారిటీని కొనసాగిస్తూ వస్తోంది. ఆ మధ్య ఒక ప్రముఖ క్రికెటర్ తో డేటింగ్ వార్తలలో వచ్చిన సంజన ఈమధ్యన 15 కోట్ల అపార్ట్ మెంట్ కొనుక్కోవడంతో సంజన ఏమి చేసినా అది మీడియాకు హాట్ టాపిక్ గా మారుతోంది.

ఈ వార్తలు ఇలా ఉండగా ఈ బ్యూటీ ఒక కోలీవుడ్ హీరోకు లైన్ వేస్తోంది అని కోలీవుడ్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈ మధ్య జరిగిన కోలీవుడ్ యంగ్ హీరో శిoబు పుట్టినరోజు సందర్భంగా అతడిని ఆకాశానికి ఎత్తేస్తూ శిoబును గ్రేట్ రాక్ స్టార్ గా, యాక్టర్ గా, సింగర్ గా అన్నింటా మించి బెస్ట్ ఫ్రెండ్ గా సంజన పెట్టిన ట్విట్ ఇప్పుడు కోలీవుడ్ కు హాట్ టాపిక్ గా మారి అనేక చర్చలకు దారి తీసింది.

ఒకప్పుడు నయనతార మధ్యలో హన్సిక లతో ప్రేమాయణం సాగించి ప్రస్తుతం ఖాళీగా ఉన్న శిoబు సంజన బుట్టలో పడిపోయాడు అంటూ రూమర్లు రాస్తోంది కోలీవుడ్ మీడియా. ప్రస్తుతం అవకాశాలు లేని సంజనకు ఫ్రీగా వస్తున్న ఈ పబ్లిసిటీ తమిళంలో కాని తెలుగులో కాని ఏమైనా అవకాశాలు తెచ్చి పెడతాయేమో చూడాలి.

ఈమధ్యనే కారులో కూర్చుని కల్లు తాగుతూ మీడియా కెమెరాలకు చిక్కిన సంజన తెలివితేటలు ఈనాటి యంగ్ హీరోయిన్స్ కు పాఠాలుగా ఉపయోగపడతాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: