గతంలో అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు వేరుగా వచ్చి వెళ్ళిపోతూ ఉండేవి. ఆ సినిమాలను కేవలం ఒక తరగతి ప్రేక్షకులు మాత్రమే చూసేవారు. అయితే మారిన పరిస్థితులలో అడల్ట్ సినిమాలను కూడా భారీ బడ్జెట్ తో రూపొందిస్తూ దానికి ఒక చారిత్రాత్మక లేదా జానపద కథను జోడించి ప్రేక్షకులను తెలివిగా ధియేటర్లకు రప్పించి నిర్మాతలు కాసులు దండుకుంటున్నారు.

ఇప్పుడు అటువంటి ప్రయోగమే మరోసారి జరగబోతోంది. సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఏక్ పహెలి లీలా’ సినిమా ట్రైలర్ ను చూసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. ఈ ట్రైలర్ ఒకేసారి ఈ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో సన్నీ గత సినిమాలకు భిన్నంగా కనిపిస్తూ నటిస్తోంది.

ప్రేమ కథ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథకు రివేంజ్ అంశాన్ని జోడించారు. కొన్ని వందల సంవత్సరాల కిందట జరిగిన కథతో ఈ సినిమా సాగుతుంది. ట్రైలర్ చూస్తేంటే సన్నీ లియోన్‌ను ఆరాధించే అభిమానులకు నిరాశ పడకుండా ఈసినిమాలో సన్నివేశాలు ఉన్నాయి అని తెలుస్తోంది. తన శృంగార విశ్వరూపాన్ని సన్నీ ఈ సినిమాలో చూపించ బోతోంది అని టాక్.

సన్నీ లియోన్ గత సినిమాల పెర్ఫార్మెన్సుతో పోలిస్తే ఈ చిత్రంలో ఆమె నటన ఆకట్టుకునే విధంగా ఉంటుందని బాలీవుడ్ టాక్. ఈ సినిమా విజయవంతమైతే అడల్ట్ కంటెంట్ తో ఉన్న చారిత్రక సినిమాలు ఇదే మూసలో చాలానే వచ్చే అవకాశాలు ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: