హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారు లోకం’ సినిమాల ఘన విజయం తరువాత వరుణ్ సందేష్ టాలీవుడ్ టాప్ యంగ్ హీరో అయిపోతాడు అని అనుకున్నారు అంతా. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ యంగ్ హీరో ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఫైయిల్యూర్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో మరి ఎప్పుడు వెళ్ళి పోతున్నాయో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాయి.

కనీసం ఇతడి సినిమాలు ఛానల్స్ లో ప్రసారం అయినా చూసే వారు చాల తక్కువగా ఉన్నారు అంటే ఇతడి కెరియర్ ఎంత రివర్స్ గేర్ లో ఉందో అర్ధం అవుతుంది. ఇటువంటి పరిస్థుతులలో ఈ హీరో ఏకంగా జూనియర్ సినిమా ‘టెంపర్’ కు పోటీగా కేవలం ఒకేఒక్క రోజు గ్యాప్ తో వస్తున్న ‘పడ్డానండీ ప్రేమలో మరి’ సినిమా చేస్తున్న సాహసం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

ఇది చాలదు అన్నట్లుగా ఈ సినిమాలో మహేష్ బాబు ‘మురారి’ సినిమాలోని ‘అలనాటి రామచంద్రుడికి అన్నింటా సాటి’ పాటను అనుకరిస్తూ ఒక పెళ్ళి సీన్ ను క్రియేట్ చేసి ‘నీల గగన ఘనశ్యామునికి’ అనే పాట ఈ సినిమాలో ఉందని తెలుస్తోంది.

ఒక వైపు జూనియర్ సినిమాతో పోటీ పడుతూ మరో వైపు టాలీవుడ్ ప్రిన్స్ ను అనుకరిస్తూ వరుణ్ సందేశ్ చేస్తున్న సాహసం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: