‘పవర్’ సినిమా తర్వాత తెలుగులో ఆఫర్లు లేక కోలీవుడ్ లోనే కాలం గడిపేస్తున్న హన్సిక ప్రస్తుతం తమిళ సినిమాలతో బాగా బిజీగా వుంది. ‘దేశముదురు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు... తెలుగులో కొన్ని సినిమాలు నటించినప్పటికీ... అనుకున్న స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకోలేకపోయింది. దీంతో కోలీవుడ్ లో ఈ అమ్మడు నటించిన సినిమాలు విజయం సాధిస్తుండటంతో వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.

అయితే హన్సిక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ లో డైరెక్టర్ తో గొడవ పడినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం హన్సిక తమిళంలో ‘పులి’ సినిమాలో నటిస్తోంది. విజయ్ హీరోగా ఓ సోషియో ఫాంటసీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శింబుదేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం చెన్నై బీచ్ రోడ్డులో 15 ఎకరాల విస్తీర్ణంలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ముత్తురాజ్ ఓ భారీ రాజమహల్ సెట్ ను రూపొందించారు.

ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విజయ్ సరసన శృతిహాసన్, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో హన్సిక కత్తి తిప్పే సన్నీవేశాలలో నటించాల్సి వుంది. అందుకోసం హన్సిక కత్తి శిక్షణ తీసుకుంటోంది. శిక్షణలో మొదటి భాగం పూర్తయ్యేసరికి హన్సికకు చిన్న చిన్న గాయాలయ్యాయని తెలిసిన విషయమే. అయితే తనకి గాయాలు కావడంతో హన్సిక చాలా బాధపడుతుందట.

ఎందుకంటే తనకి రాని పనులను, ఇష్టం లేకుండానే దర్శకుడు తన చేత చేయిస్తున్నాడనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ గాయాలు అనంతరం, డైరెక్టర్ మరోసారి హన్సికకి ఓ స్టంట్ ని చేయమని చెప్పాడు. అందుకు హన్సిక నిరాకరించిందట. డైరెక్టర్ తనపై మరీ ఒత్తిడి తీసుకురావడంతో, షూటింగ్ లో అక్కడిక్కడే డైరెక్టర్ ని హన్సిక తిట్టేసిందనే న్యూస్ చిత్ర వర్గాల ద్వార బయటకు వచ్చింది. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: