టాప్ హీరోయిన్స్ దగ్గర నుంచి యంగ్ హీరోయిన్స్ వరకు ఎవరినైనా చాల హాట్ గా కనిపిస్తున్నారు అని కామెంట్ చేస్తే మురిసి పోతారు. అయితే దీనికి భిన్నంగా ఒక తెలుగు హీరోయిన్ ప్రస్తుతం ప్రవర్తిస్తున్న తీరు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయిన ఈషా నటిగా మంచి పేరు తెచ్చుకుంది.

అయితే ఆమె గ్లామర్ కు సంబంధించి పెద్ద మార్కులు పడక పోవడంతో ఆ తరువాత టాలీవుడ్ లో ఏమి అవకాశాలు రాలేదు. ఈ సినిమా తరువాత చాల గ్యాప్ తీసుకుని ఈమె నటించిన ‘బందిపోటు’ సినిమా గతవారం విడుదల అయింది. ఈ సినిమా కథ చిత్రీకరణ మరీ స్లోగా ఉండటంతో ఏ తరగతి ప్రేక్షకులను కూడా మెప్పిoచలేని సినిమాగా అల్లరోడి ‘బందిపోటు’ మారిపోయింది.

అయితే ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఈమధ్య ఈమె పాల్గొన్న ఒక కార్యక్రమంలో ఆమెను ఇంటర్వ్యూ చేసిన యాంకర్ ఈషాను ‘బందిపోటు’ సినిమాలో హాట్ గా స్పైసీగా కనిపించారు అని కామెంట్ చేసే సరికి ఆమెకు ఎక్కడలేని కోపం వచ్చిందని టాక్.

తన నటన గురించి సినిమా గురించి మాట్లాడండి కాని తనను హాట్ హీరోయిన్ అంటూ కామెంట్ చేస్తే చికాకుగా ఉంటుందని చెప్పి ఆ యాంకర్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందట ఈషా. పెళ్ళి అయి పిల్లలు కూడ ఉన్న అనసూయ హాట్ అన్న పదాలకు మురిసి పోతూ ఉంటే ఈషా మాత్రం ఈ స్పైసీ పిలుపులకు తెగ చికాకు పడిపోవడం ఆశ్చర్యకరం..

మరింత సమాచారం తెలుసుకోండి: