కొంత కాలంగా ఎన్టీఆర్ కు సరైన హిట్ లేకపోవడంతో కాస్తంత ఇబ్బంది పడుతున్నా ఈ మధ్య వచ్చిన టెంపర్ తో తనలో వెయ్యి వోల్టుల పవర్ వచ్చినంత సంతోషంలో మునిగి పోతున్నాడు. గతంలో పూరి జగన్నాధ్ తో ఆంధ్రావాల సినిమాతో యావరేజ్ హిట్ అయినా టెంపర్ తో ఈ సంవత్సరం సూపర డూపర్ హిట్ అందుకున్నాడు.

ఎక్కడ చూసినా టెంపర్ ముచ్చట్లే ఇండస్ట్రీలో అటు దర్శకుడికి, హీరో కి వండర ఫుల్ రికార్డులు నమోదు చేసున్నట్లే లెక్క. టెంపర్ విడుదలైన అన్ని కేంద్రాలలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుందంటే ఈ సినిమా కు వచ్చిన క్రేజ్ అలాంటిది మరి. ఇక పోతే టెంపర్ పది రోజుల కలక్షన్స్ ఎలా ఉన్నాయో ఒక్క లుక్ వేద్దాం...

కలక్షన్స్ షేర్ లలో నైజాం - 10. 85 కోట్లు, కృష్ణ - 1. 87 కోట్లు, నెల్లూరు - 1. 13 కోట్లు, గుంటూరు - 2. 75 కోట్లు, కడప టౌన్ -26,57,784 లక్షలు, ప్రొద్దుటూరు - 20 లక్షలు , కర్నూల్ సిటీ - 54 లక్షలు, ఓవర్సేస్ - 3 కోట్లు, మొత్తంగా టెంపర్ పది రోజులకు 34 కోట్లు వసూలు చేసింది.

ఏదైమైనా నందమూరి నామ సంత్సరం నెలకొల్పుతామన్న ఎన్టీఆర్ అది సాధించినట్లే అని చెప్పుకోవచ్చు కారణం అన్న కళ్యాన్ పటాస్, ఎన్టీఆర్ టెంపర్ టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక్క ఊపు ఊపేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: