బాల నటుడిగా తెరంగట్రం చేసి కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ హీరోగా బహుముఖ ప్రజ్ఞాశీలిగా ఆలి తెలుగు ప్రేక్షకులు సుపరిచితుడే. ఆయన సోదరుడు కూడా బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి సహనటుడిగా సినిమాలు చేస్తున్నాడు. మహ్మద్ ఖయ్యూం వివాహం (నిఖా) ఆదివారం గుంటూరులోని సన్నిధి కల్యాణ మండపంలో వైభవంగా జరిగింది.

ప్రస్తుతం ఖయ్యూం చిన్న చిన్న సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయనకు సరైన టర్నింగ్ పాయింట్ దొరకలేదు. ఖయ్యూమ్ ఈ మధ్యే బుల్లి తెరపై కూడా ఓ షో నిర్వహించారు. అన్నయ్య అంటే తనకు ఎంతో గౌరవం అని ఆయన మాట ప్రకారమే నేను నడుచుకుంటాను అని ఒకానొక ఇంటర్యవూలో ఖయ్యూం తెలిపారు.

గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ నయాబ్ కమాల్ పెద్దకుమార్తె ఆర్షియా కమాల్ తో ఖయ్యూంకు వివాహమైంది. ఈ వేడుకకు ప్రముఖ సినీనటులు, డైరెక్టర్లు, రాజకీయ నాయకులు, గుంటూరు నగరానికి చెందిన ప్రముఖులు హాజరై ఖయ్యుంకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

సినీనటులు శ్రీకాంత్, అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, తరుణ్, రాజీవ్ కనకాల, వెంకట్, దర్శకులు కృష్ణవంశీ, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, నటుడు, ఎంపీ మురళీ మోహన్, ఎంపీ రాయపాటి సాంబశివరావుతో పాటు పలువురు ప్రముఖులు ఈ వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: